https://oktelugu.com/

Rajamouli : రాజమౌళి మహేష్ బాబు సినిమాకి ముహూర్తం ఫిక్స్..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు సాధించని ఘనతను సాధించిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి...ఇండియా వైడ్ గా ఈయన సినిమాలకు భారీ గుర్తింపైతే ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 16, 2024 / 12:26 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు సాధించని ఘనతను సాధించిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి…ఇండియా వైడ్ గా ఈయన సినిమాలకు భారీ గుర్తింపైతే ఉంది. తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లిన దర్శకుడు కూడా ఈయనే కావడం విశేషం…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి… యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట రాజమౌళి… ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుని హీరోగా పెట్టి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఆయన హాలీవుడ్ లో కూడ తన సత్తా చాటాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దానికి అనుగుణంగానే తన కార్యచరణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన రాజమౌళి సినిమా షూటింగ్ కి సంబంధించిన లొకేషన్స్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు సంవత్సర కాలం నుంచి ఎదురుచూస్తూ ఉన్నాడు. మరి ఇప్పటికైతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. ఇక దాంతో మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్నారు. మరి మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించిన గుడ్ న్యూస్ ని చెప్పడానికి రాజమౌళి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక సంక్రాంతి తర్వాత నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ రాజమౌళి సన్నిహిత వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమా అనౌన్స్ మెంట్ కు సంబంధించిన ఒక వీడియోని కూడా రెడీ చేశారట. దాన్ని కూడా తొందర్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక సంక్రాంతి తర్వాత నుంచి నాన్ స్టాప్ గా హైదరాబాద్ లోనే షూటింగ్ ను జరుపుకొని ఆ తర్వాత కొద్ది రోజులపాటు బ్రేక్ ఇచ్చి మళ్ళీ విదేశాలలో షూటింగ్ ను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఏం చేసినా కూడా భారీ ప్రణాళికతో చేస్తూ ఉంటాడు.కాబట్టి ఆయన విషయంలో ఎప్పుడూ ఎవ్వరూ జోక్యం చేసుకోవాల్సిన పనిలేదు.

    ఎందుకంటే ఆయన ఎంత డబ్బు అయితే సినిమా కోసం ఖర్చు చేస్తారో అంతకు డబుల్ డబ్బులను ఆ సినిమా మీద కలెక్ట్ చేసే కెపాసిటీ ఉన్న దర్శకుడు కావడం వల్ల ఆయనను అందరు ఫాలో అవ్వడం తప్ప ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే రేంజ్ లో ఎవరూ లేరనే చెప్పాలి.ఇక ఈ సినిమాను 1000 కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కించడమే కాకుండా 3000 కోట్ల కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…