Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్…ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియాలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా సూపర్ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇండియాలో ఆయన హవా భారీ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి…
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా అతి తక్కువ రోజుల్లోనే 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన సినిమాగా ఇండస్ట్రీలో భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ను సాధిస్తుంది అనే దానిమీద ఇప్పుడు తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఏమైనా కూడా అల్లు అర్జున్ ఈ సినిమాతో ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి. అయితే ఈ సినిమాకి కంటే నార్త్ లోనే భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఇప్పటివరకు ఈ సినిమా నార్త్ లో 461 కోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది. నార్త్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో పుష్ప 2 రెండవ స్థానంలో నిలవడం విశేషం…బాహుబలి 510 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా ఇక మరికొద్ది రోజుల్లో బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేయడానికి సిద్ధమవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఈ సినిమాల తర్వాత కేజీఎఫ్ 2 సినిమా 434 కోట్ల కలెక్షన్లను రాబట్టి మూడో ప్లేస్ లో నిలిచింది. ఇక ఏది ఏమైనా కూడా నార్త్ లో పెను ప్రభనజనాలను సృష్టించిన మూడు సినిమాలు సీక్వెల్ సినిమాలే కావడం విశేషం…
ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరోలు అందరూ సౌత్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా కనక 2000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టినట్టయితే అల్లు అర్జున్ పేరిట ఈ రికార్డు అనేది నమోదవుతుంది. మరి అల్లు అర్జున్ ఇంకెన్ని రోజుల్లో ఈ రికార్డును బ్రేక్ చేస్తాడు. తద్వారా ప్రభాస్ పేరు మీద ఉన్న రికార్డ్ ను అల్లు అర్జున్ తన పేరు మీదకి మార్చుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…
ఇక 1200 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా 2000 కోట్ల కలెక్షన్లతో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకు భారీ గుర్తింపు రావడంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఒక పెను సంచలనాన్ని సృష్టిస్తున్న సినిమాగా ముందుకు సాగుతుందనే చెప్పాలి…