https://oktelugu.com/

Rajamouli and Rajinikanth : చెప్పి మరి రజినీకాంత్ రికార్డ్ ను బ్రేక్ చేసిన రాజమౌళి…ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే..?

ఇప్పటివరకు చాలామంది హీరోలు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ స్టార్లుగా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. కానీ ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దాని వెనకాల దర్శకుడు యొక్క ప్రతిభ దాగి ఉంటుందనే విషయం మనలో చాలా మందికి తెలియదు... వాళ్ళకి హీరో స్క్రీన్ మీద కనిపిస్తే చాలు వాళ్ల కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు...

Written By:
  • Gopi
  • , Updated On : December 30, 2024 / 10:25 AM IST

    Rajamouli , Rajinikanth

    Follow us on

    Rajamouli and Rajinikanth : ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ తమిళ్ సినిమా ఇండస్ట్రీ తోనే కలిసి ఉండేది. మనకంటూ సపరేట్ ఇండస్ట్రీ లేకపోవడం వల్ల మనందరినీ తమిళ్ ఇండస్ట్రీ కిందే లెక్కసేవారు. కానీ ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి దిగ్గజ హీరోలు కలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ కి తీసుకొచ్చారు. మొత్తానికైతే ఇప్పుడు దిగ్విజయంగా ముందుకు దూసుకెళ్తున్న మన సినిమా ఇండస్ట్రీ యావత్ ఇండియన్ ఇండస్ట్రి లోనే నెంబర్ వన్ ఇండస్ట్రీగా కొనసాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇప్పుడున్న హీరోలందరూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే దర్శకులు సైతం మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఇదిలా ఉంటే రాజమౌళి చేసిన బాహుబలి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక బాహుబలి 2 సినిమా అయితే దాదాపు 1900 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ ను క్రియేట్ చేసిందనే చెప్పాలి. అయితే రాజమౌళి అన్ని లాంగ్వేజ్ లో బాహుబలి సినిమాతో భారీ రికార్డులను క్రియేట్ చేసినప్పటికి ఒక జపాన్ లో మాత్రం ఆయన ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయలేకపోయాడు. దాంతో ‘త్రిబుల్ ఆర్’ సినిమా సమయంలో ఆయన జపాన్ లో భారీ రికార్డులను క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆ సినిమాని జపాన్ లో రిలీజ్ చేశారు.

    ఇక అప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ చేసిన ముత్తు సినిమా నే జపాన్ లో భారీ రికార్డులను క్రియేట్ చేసిన సినిమాగా అక్కడి ఇండస్ట్రీలో ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేసుకుంది. ఇక ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ మూవీ వచ్చిందో ముత్తు సినిమా రికార్డును బ్రేక్ చేసి భారీ విజయాన్ని సాధించింది.

    ఇక దాదాపు 25 సంవత్సరాల తర్వాత రజనీకాంత్ చేసిన ముత్తు సినిమా రికార్డు బ్రేక్ అవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ‘త్రిబుల్ ఆర్ బిహైండ్ బియాండ్’ అనే డాక్యుమెంటరీ ని రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి చాలా విషయాలను పంచుకున్నారు. అయితే రాజమౌళి జపాన్ లో ముత్తు సినిమా రికార్డు ను త్రిబుల్ ఆర్ సినిమా బ్రేక్ చేస్తుందంటూ అప్పుడే చెప్పాడు.

    దాంతో రాజమౌళి చెప్పి మరి ఆ రికార్డ్ ను బ్రేక్ చేశాడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం రాజమౌళి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడిగా రాజమౌళి పేరు సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…