Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కారణం ఏదైనా కూడా తెలుగు సినిమా స్థాయి అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం అనేది మనం చూస్తూనే ఉన్నాము…సినిమా అనేది ఒక సముద్రం లాంటిది అయితే అందులో ఎలాంటి సినిమాలను ఎంచుకొవాలి అనేది పెద్ద టాస్క్ అందుకే హీరోలు కొన్ని సినిమాల విషయంలో రాంగ్ డిసీజన్స్ తీసుకొని దెబ్బై పోతుంటారు…
సినిమా ఇండస్ట్రీలో హీరోలు వరుస సక్సెస్ లను సాధించాలని కోరుకుంటారు. కారణం ఏంటి అంటే ఇక్కడ సక్సెస్ లు సాధించిన హీరోలకే చాలా మంచి గుర్తింపు ఉంటుంది. అలాగే మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది. తద్వారా వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు ఉన్నప్పటికి రాజమౌళి లాంటి దర్శకుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పాలి. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకు ఇండియాలో మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. రాజమౌళి తన సినిమాల్లో హీరోలను చాలా ఎక్స్ట్రార్డినరీగా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే ఆయన చాలా కేర్ తీసుకొని మరి తన హీరోలను తను అనుకున్న బాడీ లోకి తీసుకురాగలుగుతాడు.
ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల హీరోల కెరియర్లు నాశనం అయిపోతున్నాయి అంటూ మరి కొంతమంది చెబుతున్నారు. కారణం ఏంటి అంటే బాహుబలి సినిమాని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అందులో రానా, ప్రభాస్ ఇద్దరు కూడా భారీగా బాడీ పెంచడం ఆ తర్వాత ఆ బాడీని మెయింటైన్ చేయలేక హెల్త్ పరంగా ఇబ్బందులను ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉన్నాము…
రానా అయితే బాహుబలి సినిమాలో అంత భారీ బాడిని మెయింటెన్ చేయడానికి ఆయన ఇష్టం వచ్చినట్టుగా డైట్ ఫాలో అవుతూ ఫుడ్ విపరీతంగా తిన్నాడు. నాన్ వెజ్ అయితే ఎక్కువగా తినడం వల్ల తన కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి తన ఒక కిడ్నీ చెడిపోయిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన కిడ్నీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నప్పటికి హెల్త్ అయితే భారీగా చెడిపోయింది…
ఇక మర్యాద రామన్న సినిమా సమయంలో సునీల్ సన్నబడడం ఆ తర్వాత సునీల్ బాడీ కూడా భారీగా పెరిగిపోవడం మనం చూశాం. మరి మొత్తానికైతే రాజమౌళి తన సినిమాల కోసం హీరోలతో ఏదైనా చేయిస్తాడు. కానీ వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ జరిగితే మాత్రం తన బాధ్యుడిని కాదు అనే మాటలు కూడా ఆయన నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఇక తనతో సినిమా చేస్తే హీరోలకి భారీ సక్సెస్ వస్తుంది. కానీ ఆ తర్వాత ఆయా హీరోలు చేసిన సినిమాలేవీ కూడా పెద్దగా సక్సెస్ లను సాధించవు అనేది మాత్రం వాస్తవం…