SS Rajamouli Varanasi: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలను రేకత్తిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాతో రాజమౌళి ఎక్కడలేని హైప్ ను క్రియేట్ చేసుకున్నాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసిన రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ షెడ్యూల్స్ అన్నింటిని కలిపి ఈ సినిమా లో ఉన్న కీలకమైన సన్నివేశాలైతే తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు అంటూ చాలా వార్తలయితే వచ్చాయి. కానీ ఇప్పుడు రాజమౌళి స్ట్రాటజీ ప్రకారం ఈ సినిమాలో మెయిన్ విలన్ కాదట… దాని కోసం వేరే ఒక హాలీవుడ్ ఆర్టిస్ట్ ఉన్నాడని అతనిదే ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర అని రాజమౌళి చెబుతుండడం విశేషం…
Also Read: రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యకరం? తక్కువైనా.. ఎక్కువైనా.. ఎలాంటి సమస్యలు?
ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా రివిల్ చేయలేదు కానీ ఇప్పటివరకైతే పృధ్విరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు అంటూ చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది.
మరి దానికి తగ్గట్టుగానే ఆయన తన సినిమాలను ప్లాన్ చేస్తూ ఉంటాడు. మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాలో ఎలాంటి డిఫరెంట్ విధానాన్ని పాటిస్తున్నాడు. ఎలాంటి టెక్నాలజీతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకత్తిస్తుంది…
తను గతంలో చేసిన బాహుబలి, త్రిపుల్ ఆర్ సినిమాలను మించి ఈ సినిమా ఉండబోతుందట. 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఈ సినిమాతో రాజమౌళి ప్రపంచం లో ఉన్న టాప్ డైరెక్టర్లందరికి పోటిని ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…