https://oktelugu.com/

జక్కన్న ప్లాన్ అదుర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ ఇక జెట్ స్పీడ్?

దర్శక దిగ్గజం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ‘ఆర్ఆర్ఆర్’లో తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ షూటింగ్ నిలిచింది. Also Read : ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2020 / 01:18 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ‘ఆర్ఆర్ఆర్’లో తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ షూటింగ్ నిలిచింది.
    Also Read : ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

    2021 జనవరి 8న సంక్రాంతి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. అయితే కరోనా కారణంగా షూటింగ్ వాయిదాపడటంతో ఈ మూవీ సంక్రాంతికి వచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. గతంలోనూ పలుసార్లు రిలీజ్ తేది వాయిదా పడినట్లుగా మరోసారి వాయిదా పడే అవకాశం కన్పిస్తోంది. ఇటీవలే షూటింగు ప్రారంభించేందుకు రెడీ అయిన దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కరోనా బారినపడటంతో మరోసారి షూటింగు నిలిచిపోయింది.

    ఇటీవలే కరోనా నుంచి బయటపడిన దర్శకుడు రాజమౌళి షూటింగును ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. దీంతోపాటు హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లు ‘ఆర్ఆర్ఆర్’ త్వరగా పూర్తిచేసి మరో ప్రాజెక్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో రాజమౌళిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో రాజమౌళి సైతం వీలైనంత త్వరగా షూటింగును ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఈమేరకు అన్ని‘ఆర్ఆర్ఆర్’ చిత్రయూనిట్ నయా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

    ఇటీవలే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కరోనా ప్రభావం లేని దేశాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం ‘బెల్ బాటామ్’ షూటింగ్ నిశ్చితంగా జరుపుకుంటుంటోంది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రయూనిట్ కూడా కరోనా లేని యూరప్ దేశాలపై దృష్టిసారించింది. ఇప్పటికే ఆయా దేశాల్లోని లోకేషన్ల అనుమతి కోసం నిర్మాత దానయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాలో ఒళ్లుగగుర్పిచేలా ఓ యాక్షన్ ఎసిపోడ్ చిత్రీకరణ చేసేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు. ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ విన్పిస్తోంది.