చైనా దుస్సాహాసం.. భారత్ ను హెచ్చరిస్తున్న మీడియా

భారత్-చైనా దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల భారత్ సరిహద్దుల్లోని గాల్వానా లోయలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో భారత్ కు చెందిన 21మంది జవాన్లు అమరులయ్యారు. తెలంగాణ కు చెందిన కల్నల్ సంతోషం సైతం వీరమరణం పొందిన సంగతి తెల్సిందే. చైనాను దొంగదెబ్బను భారత్ సైనికులు ప్రతిఘటించడంతో చైనాకు చెందిన జవాన్లు సైతం భారీగానే మృతిచెందారు. అయితే చైనా మాత్రం మృతుల వివరాలను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. భారత్ సైనికుల […]

Written By: NARESH, Updated On : September 8, 2020 2:18 pm
Follow us on


భారత్-చైనా దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల భారత్ సరిహద్దుల్లోని గాల్వానా లోయలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో భారత్ కు చెందిన 21మంది జవాన్లు అమరులయ్యారు. తెలంగాణ కు చెందిన కల్నల్ సంతోషం సైతం వీరమరణం పొందిన సంగతి తెల్సిందే. చైనాను దొంగదెబ్బను భారత్ సైనికులు ప్రతిఘటించడంతో చైనాకు చెందిన జవాన్లు సైతం భారీగానే మృతిచెందారు. అయితే చైనా మాత్రం మృతుల వివరాలను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

భారత్ సైనికుల మృతిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం చైనాకు దిమ్మతిరిగే షాకిలిస్తూ పోతుంది. భారత్ సరిహద్దుల్లోని కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకొని అధికారాన్ని కల్పించింది. అదేవిధంగా త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. దీంతోపాటు చైనాకు చెందిన పలు కాంట్రాక్టులు, యాప్స్ ను నిషేధించి షాకిచ్చింది.

Also Read : బ్రేకింగ్:భారత్-చైనా బలగాల మధ్య కాల్పులు!

ఇటీవలే ఫ్యాన్స్ దేశం నుంచి అత్యాధునికమైన ఐదు రఫెల్ యుద్ధవిమానాలను భారత్ తీసుకొచ్చింది. వీటిని ఇప్పటికే సరిహద్దుల్లోని మోహరించింది. రఫెల్ యుద్ధవిమానాల చేరికతో భారత్ కు అదనపు శక్తి వచ్చినట్లయింది. ఈ పరిస్థితులను తట్టుకోలేని చైనా మాత్రం భారత్ ను నేరుగా ఎదుర్కొలేమని తెలుసుకుంది. దీంతో కుటీల యత్నాలతో భారత్ న దొంగ దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది.

భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే రక్షణపరంగా శక్తివంతమైన దేశాల్లో పోటీ పడుతోంది. చైనా రక్షణలో మనకంటే ముందున్న మన సైనికులు చూపే ఆత్మస్థైర్యం ముందు ఆ దేశాన్ని యుద్ధంలో ఎదుర్కొవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక యుద్ధం వస్తే అమెరికా, రష్యా దేశాలతోసహా పలు దేశాలు భారత్ వైపే నిలిచే అవకాశం ఉంది. ఈ పరిస్థితనులను ఆకలింపు చేసుకోలేక ఆదేశ మీడియా భారత్ పై విషం చిమ్ముతోంది.

చైనా సహనాన్ని భారత్ పరీక్షిస్తుందని.. సరిహద్దుల్లో భారత్ సైనికులే ఘర్షణకు దిగుతున్నారని ఆరోపిస్తోంది. భారత్ కు వ్యతిరేకంగా  చైనా మీడియా పలు కథనాలను ప్రసారం చేస్తూ చైనీయుల్లో భారత్ పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచం ముందు భారత్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాన్ని చైనా చేస్తోంది. అయితే గత రాత్రే చైనా  కాల్పులు జరిపినా భారత్ సైన్యం నేర్పుతో తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. చైనా తన దురుసు తనాన్ని తగ్గించుకోకపోతే భారత్ సైతం ధీటుగా ఇచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయి. దీంతో మున్మందు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయని సరిహద్దుల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.