
‘కులాల జాబితాలు సవరించడం తప్పనిసరి. అది జరిగినప్పుడే రిజర్వేషన్ ఫలాలను ఇప్పటికే వాటిని అనుభవిస్తున్న వారు తన్నుకుపోకుండా చూడగలం’ అని గతంలోనే సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తమను ఆ జాబితాలోకి మార్చాలని.. తమను ఈ జాబితాలోకి తీసుకురావాలంటూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా కులాల నుంచి డిమాండ్లు కూడా వచ్చాయి. వీటిపై పూర్తిస్థాయిలో బీసీ కమిషన్ కూడా నివేదిక ఇచ్చింది. పలు కులాలను బీసీ ఏగా.. మరికొన్నింటిని బీసీ డీలుగా గుర్తింపు ఇవ్వాలని సిఫారసు చేసింది.
Also Read: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
దీంతో సోమవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీలో సీఎం కేసీఆర్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. అందులో భాగంగా పలువురు కులస్తులగా బీసీలోకి మార్చేందుకు నిర్ణయించారు. దీని ప్రకారం.. 17 కొత్త కులాల్లో బీసీ ఏ లుగా చాలా మంది గుర్తింపులోకి వస్తున్నారు. ఈ జనాభా 28,402 ఉన్నట్లుగా తేలింది. అదేవిధంగా బీసీ డీ జాబితాలో చేరే కులాల జనాభా సంఖ్య 15,409గా నిర్ధారించారు. కేబినెట్ నిర్ణయంతో మొత్తంగా 9,849 కుటుంబాలకు లబ్ధిచేకూరుతోంది. కొత్తగా చేరుతున్న కులాలు ఇలా ఉన్నాయి..
బీసీ ఏ
అద్దపువారు
బాగోతుల
బైల్ కమ్మర
ఏమాటి
గంజికూటివారు
గౌడ జెట్టి
కాకి పడగల
పటం వారు/మాసయ్యలు
ఓడ్
సన్నాయి
శ్రీ క్షత్రియ రామజోగి
తెర చీరల
తోలుబొమ్మలాటవారు (బొప్పల)
———
బీసీ డీ
అహిర్ యాదవ్
గొవిలి
కుల్ల కడగి
సారోల్లు
Also Read: తెలంగాణ సర్కార్ మరో భారీ ఆఫర్