Rajamouli SSMB29 Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి గుర్తింపును సంపాదించుకున్నప్పటికి స్టార్ హీరోలు మాత్రం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి మంచి సినిమాలను చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలకు సూపర్ సక్సెస్ లను కట్టబెట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి గుర్తింపును సంపాదించుకున్నా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి భారీ ఐడెంటిటి ని కట్టబెట్టడమే కాకుండా తన దైన రీతిలో సత్తా చాటుకోవడానికి చాలావరకు హెల్ప్ అయ్యాయి…ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తే ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడిగా మంచి గుర్తింపునైతే తెచ్చుకుంటాడు. అలాగే హాలీవుడ్ రేంజ్ లో సినిమాను తీయగలుగుతున్న తొలి భారతీయ దర్శకుడు కూడా తనే అవుతాడు. ఇక ఇప్పటి వరకు రాజమౌళి చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా మరొక ఎత్తుగా మారిపోతోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మహేష్ బాబు పోస్టర్ ను రిలీజ్ చేశాడు. మరి ఆ పోస్టర్లో మహేష్ బాబు ఫోటో కనిపించినప్పటికి ఆ సినిమాలో మహేష్ బాబుకి దైవభక్తి ఉన్నట్టుగా అలాగే దైవంతో ఈ సినిమా ముడిపడ్డట్టుగా తెలియజేయడానికి మహేష్ బాబు మెడలో డమరుకం శివలింగం నంది ఫోటోలు వచ్చేలా ఒక పోస్టర్ ను అయితే రిలీజ్ చేశాడు…
Also Read: నన్ను నేను తారక్ లో చూసుకున్నాను..అతని నుండి చాలా నేర్చున్నాను – హృతిక్ రోషన్
ఇక ఇప్పటి వరకు రాజమౌళి తన గత చిత్రాల్లో వేటి మీద పెట్టనంత ఫోకస్ ఈ సినిమా మీద పెడుతున్నట్టుగా తెలుస్తోంది…ఈ సినిమా కోసం ప్రపంచ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఈ సినిమా నుంచి రాబోతున్న టీజర్ ని ‘అవతార్ 3’ సినిమా రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 19వ తేదీన జేమ్స్ కామెరూన్ చేతుల మీదిగా రెడీ చేయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.
జేమ్స్ కామెరూన్ కి రాజమౌళి చాలా పెద్ద అభిమాని అనే విషయం మనకు తెలిసిందే…ఇక రాజమౌళికి జేమ్స్ కామెరూన్ మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. రాజమౌళి తరచుగా కామెరూన్ ను కలుస్తూ ఉంటానని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అలాగే కామెరూన్ తనతో త్రిబుల్ ఆర్ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడాడనే విషయాన్ని కూడా చెప్పాడు. అలాగే మహేష్ బాబు సినిమా గురించి తను అప్డేట్స్ ని కూడా అడిగి తెలుసుకుంటున్నట్టుగా రాజమౌళి ఒకానొక సందర్భంలో తెలియజేయడం విశేషం…
Also Read: ‘వార్ 2’ లో ఆధిపత్యం చూపించే హీరో ఎవరు..?
ఇక ఇదిలా ఉంటే అవతార్ 3 సినిమా రిలీజ్ రోజున కామెరూన్ తో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయించాలనే ప్లాన్ అయితే అద్భుతంగా ఉంది. జేమ్స్ కామెరూన్ చేతిలో మీదిగా టీజర్ రిలీజ్ చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రేక్షకుడికి రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన అలాంటి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…