SS Rajamouli Son Karthikeya: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఆయన చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటాయి. ప్రతి సీన్ లో కూడా ఎమోషన్ ని పెడుతూ ప్రతి ప్రేక్షకుడి చేత శభాష్ అనిపించుకోవడమే రాజమౌళి యొక్క లక్షణం… అలాంటి దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
రాజమౌళి కొడుకు అయిన కార్తీకేయ సైతం మొదట్లో ప్రొడక్షన్ సైడు ఆయన తన బాధ్యతలను కొనసాగించాడు. ఇక ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌజ్ కూడా స్థాపించినట్టుగా తెలుస్తుంది. మధ్యలో ఒక బిజినెస్ ను కూడా స్టార్ట్ చేసి విపరీతంగా నష్టపోయాడు. మరి మళ్ళీ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారాడు. కాబట్టి ఇప్పుడు తను ప్రొడ్యూస్ చేసే సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
నిజానికి రాజమౌళి కొడుకు అయిన కార్తికేయ సినిమా ఇండస్ట్రీలోనే ఉండి హీరోగా గాని లేదంటే దర్శకుడిగా గాని ప్రయత్నం చేస్తే బాగుండేది. అలా కాకుండా బిజినెస్ వైపు వెళ్లడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా రాజ్యమౌళి అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. తొందర్లోనే తను ఏం కావాలనుకుంటున్నాడు అసలు తన టార్గెట్ ఏంటి అనేది తెలుసుకుంటే మంచిదని లేకపోతే ఆయన చాలా వరకు తన కెరీర్ ని కోల్పోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చని కొంతమంది ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు.
తనకి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీలోనే ప్రొడ్యూసర్ గా గాని లేదంటే దర్శకుడుగా గాని రానిస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు కామెంట్లు చేస్తున్నారు… లేదంటే రాజమౌళి చేసే సినిమాలకు సహాయకుడిగా వ్యవహరించిన కూడా రాజమౌళికి కొంచెం హెల్ప్ ఫుల్ గా ఉంటుందని మరి కొంత మంది భావిస్తున్నారు…
