Rajamouli Tollywood Crisis: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)…తెలుగులో భారీ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకన్నాడు. ఇక ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతుండటమే కాకుండా యావత్ ప్రపంచ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇప్పుడు చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటు ముందుకు సాగుతూ ఉండడం విశేషం… యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కని క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఇక తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్న దర్శకుడు కూడా తనే కావడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే సినిమా సక్స్ కోసం తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నాడు.
Also Read: ఆ స్టార్ హీరో చేయాల్సిన రెండు సినిమాలను చేసి సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు…
మరి తను అనుకున్నట్టుగానే ఇకమీదట మంచి సినిమాలను చేస్తూ ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమా చూడకపోవడానికి ఒక ముఖ్య కారణం రాజమౌళి అనే చెప్పాలి.
రాజమౌళి తీసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలను 150 రూపాయల టికెట్ పెట్టి చూస్తున్న ఆడియన్స్ చిన్న సినిమాలకు కూడా అంతే టికెట్ పెట్టి చూడడానికి ఆసక్తిని చూపించడం లేదు. 150, 200 రూపాయలకే విజువల్ వండర్స్ ను చూపించిన రాజమౌళి వల్ల మిగతా సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. ఎందుకంటే వాళ్లు ప్రతి సినిమాను విజువల్ వండర్ గా ఉంటేనే సినిమా చూస్తాం అని అనుకుంటున్నారు.
Also Read: తెలుగు స్టార్ డైరెక్టర్లను తన సినిమాలకి డైలాగ్ రైటర్ గా వాడుకుంటున్న రాజమౌళి…
తద్వారా చిన్న సినిమాలు, మంచి కంటెంట్ సినిమాలు వచ్చినప్పటికి ప్రేక్షకులు వాటిని చూడడానికి ఆసక్తి అయితే చూపించడం లేదు. ఒకవేళ సినిమా బావుంది అనే టాక్ వస్తే ఓటిటిలో చూసి ఆనందిస్తున్నారు… ఒకరకంగా చిన్న సినిమాలు చనిపోవడానికి ముఖ్య కారణం రాజమౌళి అనే చెప్పాలి…