Homeఎంటర్టైన్మెంట్S S Rajamouli: రాజమౌళి ఆ ఇద్దరు స్టార్ హీరోలను రిజెక్ట్ చేశాడా..? కారణం ఏంటంటే..?

S S Rajamouli: రాజమౌళి ఆ ఇద్దరు స్టార్ హీరోలను రిజెక్ట్ చేశాడా..? కారణం ఏంటంటే..?

S S Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని అతని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ను షేక్ చేసిన ఆయన ఆ తర్వాత ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ప్రేక్షకులోకాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే రాజమౌళి తన కెరియర్ స్టార్టింగ్ లో ఒక ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చినా కూడా వాటిని రిజెక్ట్ చేశారట. కారణమేంటి అంటే అప్పటికే తనకున్న కమిట్మెంట్స్ వల్ల అతను ఆ సినిమాలను చేయలేకపోయాడనే వార్తలైతే వినిపించాయి. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు సైతం రాజమౌళి డైరెక్షన్లో నటించడానికి ఆసక్తి చూపించారు.

రాజమౌళి మాత్రం ఇద్దరు హీరోలను రిజెక్ట్ చేసి తను ఎవరికైతే కమిట్మెంట్ ఇచ్చాడో వాళ్ళందరివి పూర్తి చేసుకుంటూ వచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి, బాలయ్య ఇద్దరిలో ఎవరో ఒకరు తన సినిమా చేసిన కూడా బాగుండేదని అప్పట్లో చాలామంది కామెంట్స్ చేశారు. ఇక మొత్తానికైతే రాజమౌళి స్టార్ హీరోలతో సినిమాలను చేయకుండా తనతో సినిమాలను చేసిన వాళ్లనే స్టార్లుగా మార్చాడు.

ఇక ఏది ఏమైనా కూడా తనతో సినిమా చేసిన తర్వాత ప్రతి ఒక్క హీరో స్టార్ గా మారడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు జక్కన్న చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయాలనుకునే ఆయన కల నెరవేరితే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధించి ప్రేక్షకులందరిలో ఒక చిరస్మరణీయంగా నిలిచిపోతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ అయితే ఉన్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular