Rajamouli Punch Dialogue To Suma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరో సాధించనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందు సాగే ప్రయత్నం చేస్తున్నాడు… ఈ సినిమా విషయంలో ఆయన చాలా క్లారిటీగా వ్యవహరిస్తున్నాడు.ఆయన ఇప్పటికీ రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేశాడు. ఎక్కడ ఎవరికి ఒక్క చిన్న క్లూ కూడా ఇవ్వకుండా సినిమా పనులన్నింటినీ చాలా రహస్యంగా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి పాన్ వరల్డ్ ఇండస్ట్రీని సైతం సాధించాలనే స్థాయికి ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట రాబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
Also Read: Anchor Suma : కొడుకు దెబ్బకు కోట్ల రూపాయిలు నష్టపోయిన యాంకర్ సుమ!
ఇక రాజమౌళి రీసెంట్ గా కుబేర (Kubera) సినిమా ఈవెంట్ కి హాజరైన విషయం మనకు తెలిసిందే. శేఖర్ కమ్ముల (Shekar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి… ఇక ఆ అంచనాలను రెట్టింపు చేయడానికి రాజమౌళిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. దాంతో ఈ సినిమా ఫంక్షన్ కి చాలా అట్రాక్షన్ రావడమే కాకుండా ఆ అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి.
అయితే ఈ ఈవెంట్లో యాంకరింగ్ చేస్తున్న సుమ రాజమౌళి ని ఒక క్వశ్చన్ అడిగింది… డబ్బులు కాదు ప్రేమను పంచడంలో ఇండస్ట్రీలో ఎవరు కుబేరులు అని అడిగిన ప్రశ్నకి రాజమౌళి సమాధానంగా అన్ని సినిమా ఫంక్షన్స్ ను నీ సినిమా ఫంక్షన్స్ అనుకొని చాలా ప్రేమగా అందరి ఈవెంట్లను సక్సెస్ చేస్తూ ఉంటావు.
కాబట్టి ఇండస్ట్రీలో అందరికంటే కుబేరివి నువ్వే అంటూ రాజమౌళి చెప్పిన మాటకి సుమతో పాటు అందరూ నవ్వుకున్నారు. మరి మొత్తానికి అయితే ఈ వీడియో ఫన్నీగా ఉండటమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…