Kamalini Mukherji: కొంతమంది హీరోయిన్లు ఉంటారు, వాళ్ళు చేసింది కేవలం కొన్ని సినిమాలు మాత్రమే కావొచ్చు, కానీ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ముద్ర వేసి వేసి వెళ్తుంటారు. వీళ్ళు పోషించిన పాత్రలను అంత తేలికగా మర్చిపోలేరు. అందంతో ఆకట్టుకునే వాళ్ళు కొందరైతే, నటనతో ఆకట్టుకున్న వాళ్ళు మరికొందరు. అలా నటనతో ఆకట్టుకున్న హీరోయిన్స్ లో ఒకరు కమలినీ ముఖర్జీ(Kamalini Mukherji). వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి చూసేందుకు అచ్చ తెలుగు అమ్మాయి లాగా,మన పక్కింటి అమ్మాయి లాగానే అనిపిస్తుంది. ఈమె ‘ఫిర్ మిలేంగే’ అనే బాలీవుడ్ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత తెలుగు లో ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఆనంద్’ అనే చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే ఈమె తన అందంతో, అభినయం తో మన ఆడియన్స్ మనసు దోచుకుంది.
ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఎక్కువగా ఈమె శేఖర్ కమ్ముల సినిమాల్లోనే కనిపిస్తూ ఉండేది. ‘ఆనంద్’ వంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో తెరకెక్కిన ‘గోదావరి’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇది కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, కమిలినీ ముఖర్జీ కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత పెళ్ళైంది కానీ, క్లాస్ మేట్స్, హ్యాపీ డేస్, గమ్యం,జల్సా, గోపి గోపిక గోదావరి వంటి చిత్రాల్లో నటించి మన ఆడియన్స్ కి మరింత దగ్గరైంది. 2014 వ సంవత్సరం లో విడుదలైన రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రమే ఈమెకు తెలుగులో చివరి చిత్రం. ఆ తర్వాత ఈమె మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.
Also Read: Heroines: ఈ హీరోయిన్స్ రూటే సపరేటు…ఇండస్ట్రీ లో వీళ్ళను టచ్ చేసే వాళ్ళు ఎవరు లేరు…
2016 వ సంవత్సరం లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘పులి మురుగన్’ ఈమె చివరి చిత్రం. ఆ తర్వాత ఈమె మళ్ళీ మీడియా కి కనిపించలేదు. సోషల్ మీడియా లో కూడా ఈమె అందుబాటులో లేదు. అయితే రెండేళ్ల క్రితం ఈమె ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొన్నది. ఆ ఫంక్షన్ లో కమలినీ ముఖర్జీ లుక్స్ ని చూసిన ఆడియన్స్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడినంత పని అయ్యింది. చిన్నప్పటి నుండి మనం చూస్తూ పెరిగిన కమలినీ ముఖర్జీ ఈమేనా?, ఇలా తయారయ్యింది ఏమిటి?, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను అని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించక తప్పదు. ఆ స్థాయిలో మారిపోయింది ఈ క్రేజీ హీరోయిన్. మీరు కూడా ఆమె లుక్స్ ని ఈ క్రింది వీడియో లో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.
