Anchor Suma : బుల్లితెర మీద యాంకర్ గా దాదాపుగా రెండున్నర దశాబ్దాల నుండి నెంబర్ 1 స్థానం లో కొనసాగుతూ, ఇప్పటికీ తనకు సాటి ఎవ్వరూ లేరు అనే విధంగా ముందుకు దూసుకుపోతున్న యాంకర్ సుమ(Suma Kanakala), ఇండస్ట్రీ లో అందరికంటే అత్యధిక పారితోషికం అందుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. చిన్న హీరోల దగ్గర నుండి, పెద్ద హీరోల సినిమాల వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే కచ్చితంగా సుమ ని తీసుకోకుండా ఉండలేరు. ఈమె ఇంటర్వ్యూస్ కి ఉండే క్రేజ్ కూడా మామూలుది కాదు. పలు టీవీ షోస్ కి ఇప్పటికీ ఆమె యాంకర్ గా వ్యవహరిస్తూనే ఉంటుంది. ఆమెలోని కామెడీ టైమింగ్ యే నేడు ఈ స్థాయిలో నిలబెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె భర్త రాజీవ్ కనకాల(Rajeev Kanakala) కూడా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.
Also Read : సుమను నమ్మితే నట్టేట ముంచింది… వివాదంలో స్టార్ యాంకర్, ఏం జరిగిందంటే?
ఈ ఇద్దరి దంపతులకు రోషన్(Roshan Kanakala) అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇతను ‘బబుల్ గమ్’ అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రానికి నిర్మాతలుగా సుమ, రాజీవ్ కనకాల వ్యవహరించారు. వచ్చిన నష్టాలపై రాజీవ్ కనకాల ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘మేము సంపాదించిన దాంట్లో చాలా వరకు డబ్బులను ఖర్చు చేసి ఈ సినిమాని తీసాము. కానీ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. మాకు అసలు ఏమి మిగలలేదు. ఓటీటీ మరియు సాటిలైట్ రైట్స్ ద్వారా కొంత డబ్బులు వచ్చాయి. డబ్బులు పోతే పోయాయి, మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ, ఈ సినిమాలో నా కొడుకు నటనకు మంచి మార్కులు పడ్డాయి అనే సంతృప్తి మాత్రం మాకు మిగిలింది. ఈ సినిమాతో కాకపోయినా, మరో సినిమాతో అయినా వాడు గట్టిగా కొడుతాడు అనే నమ్మకం మాకుంది. ఈ చిత్రం తర్వాత వాడికి దాదాపుగా 70 కథలు వచ్చాయి’ అంటూ చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల.
ప్రస్తుతం రోషన్ ‘మోగ్లీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘కలర్ ఫోటో’ పెద్ద హిట్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. నేషనల్ అవార్డు కూడా ఈ సినిమాకు దక్కింది. అలాంటి చిత్ర దర్శకుడి చేతిలో రోషన్ పడ్డాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్ కి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి చిత్రం లో రోషన్ లుక్స్ పరంగా అనేక విమర్శలు ఎదురుకున్నాడు. అతని రంగు పై కూడా చాలా కామెంట్స్ చేశాడు. కానీ మోగ్లీ చిత్రంలో మాత్రం రోషన్ లుక్స్ పరంగా కూడా మార్కులు కొట్టేసాడు. నటనలో ఎలాగో తనని తానూ నిరూపించుకున్నాడు. సరైన సినిమా పడితే రోషన్ టాలీవుడ్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్లొచ్చు
Also Read : యాంకర్ సుమతో అంత రోమాంటిక్ గా.. హీరో సిద్ధార్థ్ చేసిన పనికి అంతా షాక్…