Spirit Movie Heroine: యాటిట్యూడ్ తో వ్యవహరించే సినీ సెలబ్రిటీలకు మన యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga). నాకు నచ్చినట్టు సినిమా తీస్తా, ఇష్టముంటే చూడు లేకపోతే లేదు అన్నట్టుగా ఈ డైరెక్టర్ యాటిట్యూడ్ ఉంటుంది. తనతో పని చేసే హీరో హీరోయిన్స్ కి కూడా ఇలాగే కచ్చితంగా కొన్ని విషయాల్లో యాటిట్యూడ్ తో వ్యవహరించినట్టు ఉంటుంది. రీసెంట్ గా ఆయన దీపికా పదుకొనే(Deepika Padukone) విషయం లో నాడే చేసాడు. ప్రస్తుతం ప్రభాస్(Rebel star Prabhas) తో ఆయన చేస్తున్న ‘స్పిరిట్'(Spirit) చిత్రం లో హీరోయిన్ గా దీపికా పదుకొనే ని ఎంచుకున్నారు. కానీ ఆమె నేను రోజుకు కేవలం ఆరు గంటలు మాత్రమే పని చేస్తాను, నాకు రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటాలు కావాలి అనే డిమాండ్స్ పెట్టడం తో నువ్వు నాకు అవసరం లేదని నిర్మొహమాటం గా చెప్పేసాడు.
ఇక దీపికా పదుకొనే స్థానం లో ఏ హీరోయిన్ ని ఎంచుకుంటారు అనే దానిపై సోషల్ మీడియా లో ఎన్నో చర్చలు జరిపారు ఫ్యాన్స్. కొంతమంది మృణాల్ ఠాకూర్ పేరు చెప్పగా, మరి కొంతమంది రుక్మిణీ వాసంత్ పేరు చెప్పారు. ఇలా రోజుకో పేరు వినిపిస్తూ ఉండేది. కానీ సందీప్ వంగ వీళ్ళెవ్వరూ కాదు, నా సినిమాలో హీరోయిన్ గా త్రిప్తి దిమిరి(Tripti Dimri) నటిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన దర్శకత్వం వహించిన ‘యానిమల్’ చిత్రం లో త్రిప్తి దిమిరి సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. సినిమాలో ఆమె కనిపించేది తక్కువే అయినా, ఆ తక్కువ స్కోప్ లోనే చేయాల్సిందంతా చేసింది. బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి యూత్ ఆడియన్స్ కి మెంటలెక్కిపోయేలా చేసింది. ఈ చిత్రం తర్వాత ఆమెకు ఇండియా వైడ్ గా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆమె ఏకంగా మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో అవకాశం సంపాదించడం అందరినీ షాక్ కి గురి చేసింది.
ఈ సినిమా హిట్ అయితే త్రిప్తి దిమిరి రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్తుంది. పాన్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే దీపికా పదుకొనే అంత తేలికగా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. రొటీన్ హీరోయిన్ రోల్స్ కి ఆమె పూర్తిగా దూరం. కచ్చితంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో మాత్రమే ఆమె నటిస్తుంది. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆమెకు డైరెక్టర్ తో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు గాక, కానీ ఆమె ముందుగా ఆమె ఒప్పుకుంది కాబట్టి కచ్చితంగా బలమైన పాత్రనే అయ్యి ఉంటుంది. త్రిప్తి దిమిరి కి ఇది బంగారం లాంటి ఛాన్స్ అనుకోవచ్చు. దానిని ఆమె ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. ఈ ఏడాది లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ప్రస్తుతానికి తక్కువే అని అంటున్నారు విశ్లేషకులు.
The female lead for my film is now official 🙂 pic.twitter.com/U7JJQqSUVa
— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 24, 2025