Rajamouli: దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి… 100% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్న ఏకైక దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇండియాలో అతన్ని మించిన దర్శకుడు మరెవరు లేరు. ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చే సినిమాలేవీ ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్లకు సైతం చెమటలు పట్టించే విధంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట. వాళ్ళందరికి పోటీని ఇస్తూ తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక రాజమౌళి ‘వారణాసి’ సినిమా తర్వాత ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరి ని పెట్టి మహాభారతం సిరీస్ ను స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సిరీస్ లో ప్రతి ఒక్క హీరో ఉండబోతున్నాడట. వాళ్ళందరూ ఈ సినిమా కోసం వాళ్ళ డేట్స్ ఎక్కువగా కేటాయించాల్సిన అవసరమైతే ఉందని ఆయన తన సన్నిహిత వర్గాల దగ్గర తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే ఈ సినిమాతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. వారణాసి సినిమా సక్సెస్ సాధించి అతనికి హాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత మహాభారతాన్ని స్టార్ట్ చేయాలని తను ముందు నుంచి అనుకున్నాడట.
అందుకోసమే ఇప్పుడు తనను తాను హాలీవుడ్ కి పరిచయం చేసుకొని మహాభారతం సిరీస్ తో ప్రేక్షకులందరిని మరోసారి తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని అతను ముందుకు సాగుతున్నాడు. మరి ఆయన నుంచి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇదంతా చూసిన సినిమా మేధావులు మాత్రం రాజమౌళి ప్లానింగ్ అద్భుతంగా ఉందని ఆయన ఇదేవిధంగా ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు సాగితే హాలీవుడ్ లోనే కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటూ వాళ్లందరు రాజమౌళి గురించి చాలా గొప్పగా చెబుతున్నారు…