Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ రాజమౌళికి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతూ ఉంటాయి… అందువల్లే ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవడమే కాకుండా 100% సక్సెస్ రేట్ కలిగిన హీరోగా కూడా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుకునే ప్రయత్నంలో ఉన్నాడు…
దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మరోసారి ఆయన భారీ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇక త్రిబుల్ ఆర్ (RRR) సినిమాతో మల్టీస్టారర్ సినిమాలకు ఊపు తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు మరోసారి భారీ మల్టీస్టారర్ సినిమాకి తెర లేపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా అల్లు అర్జున్ తో సినిమా అయితే చేయలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ తో పాటు మరొక తమిళ్ స్టార్ హీరోతో ఆయన భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే మహేష్ బాబు సినిమా పూర్తి అవుతుందో అప్పటినుంచి ఆ సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నాడట. ఇక ఇప్పటికే తన తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ ఆ సినిమాకు సంబంధించిన కథ ను రాసే పనిలో బిజీగా ఉన్నారట.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం అడవిలో భారీ ఫైట్ ను సిద్ధం చేసిన రాజమౌళి…
ప్రస్తుతానికి మహేష్ బాబు సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టిన రాజమౌళి (Rajamouli) ఈ సినిమా పూర్తయిన తర్వాత మల్టీస్టారర్ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నారట. ఇక అల్లు అర్జున్ సైతం ‘పుష్ప2’ సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక రాజమౌళి సినిమాలో కనుక నటించినట్టయితే అల్లు అర్జున్ సైతం పాన్ వరల్డ్ సినిమా హీరోగా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్, అట్లీ లాంటి డైరెక్టర్లతో సినిమాలను చేస్తున్నాడు. వీళ్లిద్దరి డైరెక్షన్ లో సినిమాలను చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత రాజమౌళి సినిమాతో యావత్ ప్రపంచం మొత్తాన్ని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాదిస్తుంటే అల్లు అర్జున్ సైతం బాహుబలి రికార్డును బ్రేక్ చేసి తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఇప్పుడు రాబోయే సినిమాతో కూడా మరోసారి ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : రాజమౌళి తనకంటే 5 సంవత్సరాల పెద్దదైన రమా ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు…రాజమౌళి సక్సెస్ కి కారణం ఆమెనా..?