Rajamouli : మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ‘హిట్ 3′(Hit : The Third Case) చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి రాజమౌళి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతే కాకుండా హిట్ 1 లో హీరో గా నటించిన విశ్వక్ సేన్, హిట్ 2 లో హీరో గా నటించిన అడవి శేష్ లు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని రాజమౌళి ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆ మాటలను విన్న తర్వాత నాని రాజమౌళి కుటుంబానికి ఎంత మంచి సన్నిహితుడో ఆడియన్స్ కి అర్థమైంది. ఇక ఆ తర్వాత రాజమౌళి(SS Rajamouli) మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
Also Read : మహేష్ మూవీ పై రాజమౌళి ఇంత సైలెన్స్ మైంటైన్ చేయడానికి కారణం ఏంటి?
రాజమౌళి మాట్లాడుతూ ‘నాని మాట్లాడిన తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాను. నా మీద అంత అభిమానం చూపిస్తున్నందుకు ధన్యవాదాలు నాని. రీసెంట్ గానే నేను ‘హిట్ 3’ ప్రొమోషన్స్ లో ఒక ఇంటర్వ్యూ ని చూసాను. మన సినిమాకు సంబంధించి ఏదైనా లీక్ జరిగితే చాలా బాధ వేస్తాది, కోపం తో రగిలిపోతూ ఉంటాము. కానీ శైలేష్ మొన్న ఎంతో ఓర్పు తో సహనంతో మాట్లాడిన తీరు నన్ను ఎంతగానో ఆకర్షించింది. చాలా చాలా ఫ్రాంచైజ్ లు చేస్తారు. మన తెలుగు లో తక్కువగానే వస్తుంటాయి కానీ, ఈ ఫ్రాంచైజ్ లను చెయ్యాలని అనుకున్నప్పుడు ఎన్ని ఏళ్ళ సమయం పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ నువ్వు ‘హిట్ : ది ఫస్ట్ కేస్’ అని చెప్పినప్పుడే ప్రతీ ఒక్కరికి అర్థమైపోయింది, ఫస్ట్ కేస్ వచ్చిందంటే, కచ్చితంగా సెకండ్ కేస్ వస్తుంది, అలా కొనసాగుతూనే ఉంటుంది అని’.
‘ఈరోజు హిట్ ఫ్రాంచైజ్ కి ఇంత క్రేజ్ వచ్చిందంటే అది కేవలం నీవల్లే. నేనొక ఫంక్షన్ లో అన్నాను. నాని నుండి నేను చాలా ఎక్కువగా ఊహిస్తూ ఉంటాను, తాను ఏమి చేసిన అది హిట్ అని తెలిసిపోతూ ఉంటుంది కానీ, నేను ఇంకా ఎక్కువగా ఊహిస్తాను. కానీ నేను ఊహించిన దానికంటే ఎక్కువ ముందుకు వెళ్ళిపోయాడు. కానీ ఆశ తీరదు కదా ఇంకా ఎక్కువ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఉంటాము. నాని మేము కోరుకుంటూ ఉంటాము, నువ్వు ఇలాగే ముందుకు వెళ్తూ ఉండు. టీజర్, ట్రైలర్, పాటలు ప్రతీ ఒక్కటి సినిమా పై పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేశాయి. మే1 న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనేది మాత్రమే చూడాలి’ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. చూడాలి మరి రాజమౌళి ఊహించినట్టు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది.
Also Read : రాజమౌళి కంటే ముందే ఈ దర్శకుడు పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారబోతున్నాడా..?
