https://oktelugu.com/

రాజమౌళికి ఈసారి ఎదురీత తప్పదు

ప్రస్తుతం రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో భారీ మల్టీస్టారర్ ‘ఆర్. ఆర్. ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామ రాజు’ గా , తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కు తోంది. కాగా ఈ చిత్రంలో హాలీవుడ్ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ , అలియా భట్ […]

Written By:
  • admin
  • , Updated On : May 6, 2020 / 10:34 AM IST
    Follow us on


    ప్రస్తుతం రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో భారీ మల్టీస్టారర్ ‘ఆర్. ఆర్. ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామ రాజు’ గా , తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కు తోంది. కాగా ఈ చిత్రంలో హాలీవుడ్ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ , అలియా భట్ కీలక పాత్ర ల్లో కనిపించ నున్నారు. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం పూర్తయ్యింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలుపుదల జరిగింది. ఇక ఈ చిత్రానికి ఉన్న హైప్, అంచనాల వల్ల చాలా మంది బయ్యర్స్ తో ఈ సినిమా ఫ్యాన్సీ రేట్ కి అగ్రిమెంట్ జరిగింది .. ఆ క్రమంలో భారీ అడ్వాన్స్ కూడా ఇచ్చి సొంతం చేసుకున్నారని తెలుస్తోంది .

    రాజమౌళికి ఈసారి ఎదురీత తప్పదు

    అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ” ఆర్. ఆర్ .ఆర్ ” సినిమా తమ పెట్టుబడి రాబడుతుందో లేదో అని వారు ఆలోచిస్తున్నారట. లాక్ డౌన్ తర్వాత జనాలు ఒకప్పటిలా సినిమాలు చూడటానికి థియేటర్స్ కి వచ్చే పరిస్థితులు కనపడటం లేదు. అందుకే `ఆర్.ఆర్.ఆర్ ` సినిమాకి అడ్వాన్స్ ఇచ్చిన వారికీ ఇదే సంశయం కలుగుతోందట …దాంతో ఎంతో కొంత డిస్కౌంట్ మార్జిన్ ఇవ్వాలని కొనుగోలు దారులు అడిగే అవకాశం పుష్కలంగా ఉంది .