https://oktelugu.com/

రెబల్ స్టార్ చిత్రంలో విలన్ గా అరవింద్ స్వామి

బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్.. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వైజయంతి ప్రొడక్షన్ లో నిర్మించనున్నాడు. కాగా అల్లుడే ఈ చిత్ర దర్శకుడు అయినందున ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అనుకొంటున్నాడు .. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా […]

Written By: , Updated On : May 6, 2020 / 10:26 AM IST
Follow us on


బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్.. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వైజయంతి ప్రొడక్షన్ లో నిర్మించనున్నాడు. కాగా అల్లుడే ఈ చిత్ర దర్శకుడు అయినందున ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అనుకొంటున్నాడు .. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా దేశం లోని అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది.

రైతులకు కేసీఆర్ శుభవార్తలు!

ఇంతటి భారీ చిత్రం లో విలన్ కి కూడా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఆ పాత్రకి ఒక ప్రముఖ నటుడిని సంప్రదిస్తున్నారట.` రోజా , బొంబాయి ` చిత్రాలతో తెలుగు నాట పాపులర్ అయ్యి, ఆ తరవాత ‘ధ్రువ’ సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా అడుగుపెట్టిన అరవింద్ స్వామి ని ఈ భారీ చిత్రంలోప్రధాన విలన్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కాగా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో అశ్వినీదత్ ఈ చిత్రం విఎఫ్ఎక్స్ కోసం 50 కోట్ల బడ్జెట్ ను కేటాయించి నట్టు తెలుస్తోంది .. తాజా సమాచారం ప్రకారం నాగ్ అశ్విన్ లాక్ డౌన్ కాలంలో ఈ సినిమాకి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ ను పూర్తి చేసాడట. అంతేకాదు ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాడట. కాగా ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట.