Rajamouli Movie Set Making: దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో SSMB 29 తెరకెక్కుతుంది. రాజమౌళి తన గత చిత్రాలైన బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ లకు మించి ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. SSMB 29 కోసం రాజమౌళి సరికొత్త టెక్నిక్ ని ఫాలో అవుతున్నాడట.
తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తం చేసిన ఘనత రాజమౌళిదే. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని రాజమౌళి షేక్ చేశాడు. ముఖ్యంగా బాహుబలి 2 వసూళ్లలో నయా రికార్డ్స్ నమోదు చేసింది. ఇక ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి ఇమేజ్ ప్రపంచ స్థాయికి చేరింది. గ్లోబల్ సినిమా వేదికల మీద ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటింది. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు ఆర్ ఆర్ ఆర్ కొల్లగొట్టింది. హాలీవుడ్ దర్శక దిగ్గజాలు సైతం ఆర్ ఆర్ ఆర్ ని కొనియాడారు.
ఈ క్రమంలో రాజమౌళి ప్రస్తుత చిత్రం SSMB 29పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దేశంలోనే అత్యధిక బడ్జెట్ మూవీగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం. అలాగే టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న మొదటి చిత్రం. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి సరికొత్త పంథా అవలంబిస్తున్నాడట. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ ల విషయంలో ఫాలో కానీ మరో టెక్నీక్ ఫాలో అవుతున్నాడట. అదేమిటో చూద్దాం.
బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు అధిక భాగం సెట్స్ లో షూట్ చేశారు. బాహుబలి సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ నిర్మించారు. ఇప్పటికీ ఆ సెట్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాయి. అలాగే ఆర్ ఆర్ ఆర్ కోసం సైతం భారీ సెట్స్ నిర్మించారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలను సెట్స్ లో నిర్మించి, భారీగా విఎఫ్ఎక్స్ వాడారు. సెట్స్, విఎఫ్ఎక్స్ ప్రధానంగా బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలను నిర్మించారు. అవుట్ డోర్ షూటింగ్ చాలా తక్కువగా జరిగింది.
Also Read: Rajamouli and Mahesh Babu : మహేష్ మూవీపై రాజమౌళి పెద్ద ప్లానింగే
అయితే SSMB 29 చిత్రీకరణ అధిక భాగం అవుట్ డోర్ లో జరగనుందట. ఓ లాంగ్ షెడ్యూల్ ఒరిస్సా అటవీ ప్రాంతంలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ మరో సుదీర్ఘమైన షెడ్యూల్ కెన్యా దేశంలోని అడవుల్లో ప్లాన్ చేశారు. త్వరలో యూనిట్ అక్కడకు వెళ్లనుంది. కేవలం సెట్స్, విఎఫ్ఎక్స్ మీద ఆధారపడకుండా సహజమైన అవుట్ డోర్ లొకేషన్స్ లో ఎక్కువ భాగం షూట్ ప్లాన్ చేశాడట రాజమౌళి. అదే సమయంలో భారీ సెట్స్, విఎఫ్ఎక్స్ సైతం వాడనున్నారట. ముఖ్యంగా కాశీ నగరానికి సంబంధించిన భారీ సెట్ హైదరాబాద్ నగర శివారులో నిర్మించారని తెలుస్తుంది.
కాబట్టి SSMB 29లో సెట్స్, విఎఫ్ఎక్స్ తో పాటు అవుట్ డోర్ లొకేషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. మహేష్ బాబుకు జంటగా ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో నటిస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రధాన విలన్ రోల్ పృథ్విరాజ్ సుకుమారన్ చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 29 థియేటర్స్ లోకి రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టనుంది. ఈ చిత్రం కోసం మహేష్ బాబు పూర్తి మేకోవర్ అయ్యాడు.