Rajamouli-Mahesh Babu movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి… ఆ తర్వాత చేసిన సినిమాలన్నింటితో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం హీరోలకు ఎలాంటి ఇమేజ్ ఆయితే ఉంటుందో అంతకు మించిన క్రేజ్ తో రాజమౌళి ముందుకు సాగుతున్నాడనే విషయం మనందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే కెపాబులిటీ ఉన్న రాజమౌళి ఇప్పుడు చేయబోతున్న సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక హాలీవుడ్ సినిమాతో పోటీపడి మరి ఈ సినిమాని తెరకెక్కించి ఒక అడ్వెంచర్ జానర్ లో తెలుగు సినిమా తీస్తే ఎలా ఉంటుందో యావత్ ప్రపంచానికి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో రాజమౌళి మహేష్ బాబు ఇద్దరూ కలిసి ఒక వండర్ ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య కూడా భాగం కాబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే తమిళ్ మీడియా కి సూర్య ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి సినిమాలో నటించే అవకాశం ఉండొచ్చు అనే ఒక మాట చెప్పి ఒక డౌట్ ని అయితే క్రియేట్ చేసినట్టుగా కోలీవుడ్ మీడియా కొన్ని వార్తలనైతే ప్రచురించింది. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాజమౌళి సినిమాలో సూర్య నటించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఆయన ఈ సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్ లో నటిస్తాడా? లేదంటే నెగిటివ్ క్యారెక్టర్ ని పోషించబోతున్నాడా అనే విషయం మీద ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. ఇక ఈ విషయం మీద రాజమౌళి అధికారికంగా స్పందిస్తే తప్ప సూర్య ఈ సినిమాలో నటిస్తున్నాడా? లేదా అనే దాని మీద సరైన సమాధానం అయితే దొరకదు.
మరి ఈ సినిమా సంక్రాంతి తర్వాత నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతున్న నేపధ్యంలో తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను పెట్టి రాజమౌళి ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తూ కథని కూడా ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది…