https://oktelugu.com/

Rajamouli-Mahesh Babu Movie : రాజమౌళి మహేష్ బాబు ను ఆ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి కారణం ఏంటి..? ఆయన మామూలోడు కాదురా బాబు…

Rajamouli-Mahesh Babu Movie : సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆ సినిమా కథ, కథనం, దర్శకత్వం మూడు కూడా చాలా అద్భుతంగా ఉండాలి. హీరో పర్ఫామెన్స్ కొంచెం అటు ఇటు గా ఉన్న కూడా ఈ మూడింటి మీదనే సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక సినిమా సక్సెస్ అనేది ఎక్కువ భాగం దర్శకుడి మీదనే ఆధారపడి ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : March 2, 2025 / 12:49 PM IST
    Rajamouli Mahesh Babu Movie

    Rajamouli Mahesh Babu Movie(1)

    Follow us on

    Rajamouli-Mahesh Babu Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ లో తన స్టామినాయేంటో చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బాహుబలి(Bahubali) , త్రిబుల్ ఆర్(RRR) సినిమాలతో ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడిగా మారిన ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ గా మారడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా కోసం ప్రపంచంలో ఉన్న సినిమా అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం… ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా రహస్యంగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికి శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి 2027 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సింహంతో ఫైట్ చేసే ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉందట… దాంతోపాటుగా నరరూప రాక్షసులను సైతం మహేష్ బాబు ఢీకొట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా వీటితో పాటుగా చాలా అడ్వెంచర్ సీన్స్ ని కూడా ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారట… ఆఫ్రికన్ అడవుల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమాలో భారీ అడ్వెంచర్ సీన్స్ కూడా ఉంటాయట.

    Also Read : మహేష్ కి జంటగా హాలీవుడ్ స్టార్ బ్యూటీ, రాజమౌళి మాస్టర్ ప్లాన్!

    ఏది ఏమైనా కూడా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రతి ప్రేక్షకుడికి కావలసిన ఎలిమెంట్స్ అయితే ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇందులో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు నిధి వేటలో ముందుకు సాగుతున్నప్పుడు అతనికి భారీ ఆటంకాలైతే ఎదురవుతాయట.

    ఒక్కొక్క ఇబ్బందిని ఎలా దాటుకుంటూ ముందుకు సాగాడు అనే ఒక క్యూరియాసిటిని ఈ సినిమాలో చూపించబోతున్నారు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమా అంటే అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. ఆయన ఒక హీరోను సింహంలా చూపిస్తూ ఉంటాడు.

    విలన్లను సైతం చాలా స్ట్రాంగ్ గా చూపిస్తాడు. ఇక అలాంటి విల్లన్దను సైతం భారీగా ఎలివేట్ చేస్తూ వాళ్లను ఢీకొట్టే పాత్రలో మన హీరోని నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తూ ఉంటాడు. అందుకే ఆయన సినిమాల్లో ఎమోషన్స్, ఎలివేషన్స్ భారీగా ఎలివేట్ అవుతూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అదే రేంజ్ లో ఎమోషన్స్ ను చూపించి ప్రేక్షకులను కట్టిపడేస్తాడా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

    Also Read : ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ భోర్సే..రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!