Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి కి ఉన్న క్రేజ్ మరే దర్శకుడు కి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాతో వరల్డ్ లో భారీ విజయాన్ని సాధించమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సినిమా యూనిట్ తొందర్లోనే రెండో షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి దీని మీద రాజమౌళి ఎలాంటి స్పందనను తెలియజేయానప్పటికి మహేష్ బాబు రాజమౌళి సినిమా మీద ప్రేక్షకుల్లో మాత్రం విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి అంచనాలను తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఒకటి తగ్గింది అంటు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు అది ఏంటి అంటే రాజమౌళి సినిమాలో విలన్ ను చాలా స్ట్రాంగ్ గా చూపిస్తూ ఉంటాడు. మరి ఈ సినిమాలో విలనిజాన్ని అంత స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసే విధంగా కథ అయితే లేదు అనే కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
Also Read : రాజమౌళి మహేష్ బాబు కాంబో వస్తున్న సినిమాలో నటించనున్న హాలీవుడ్ స్టార్ డైరెక్టర్…
ఇంతకుముందు చాలాసార్లు ఈ సినిమా నుంచి కథ లీక్ అయింది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. కథ ప్రకారం చూసుకుంటే హీరో అడ్వెంచర్స్ చేస్తూ నిధి వేటలో ముందుకు సాగుతూ ఉంటాడు. కాబట్టి ప్రాపర్ విలన్ కి ఇక్కడ స్పేస్ అయితే లేదని అందువల్లే విలనిజాన్ని పండించడానికి ఈ సినిమాలో అంత పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల అది రాజమౌళికి కొంతవరకు మైనస్ అవుతుందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగినప్పటికి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఇది మొదటి సినిమా కావడంతో వీళ్ళ కాంబినేషన్ మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : మహేష్ బాబు సినిమాల్లో రాజమౌళి కి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమట…