Rajamouli Mahesh Babu Movie Update: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసుకున్న దర్శకుడు రాజమౌళి… భారీ సినిమాలు చేయడంలో తనను మించిన వారు మరెవరు లేరనేంతలా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంటర్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు షెడ్యూల్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన రాజమౌళి తన తదుపరి షెడ్యూల్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీలైనంత తొందరగా ఈ సినిమాని ఫినిష్ చేసి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా మూడు వేల కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టే అర్హత ఈ సినిమాకి ఉంది.
Also Read: రవితేజ వల్లే మా తమ్ముడు కార్తీ కెరియర్ నిలబడింది : సూర్య…
ఇక ప్రేక్షకులకు తన టీజర్, ట్రైలర్ ద్వారా రాజమౌళి సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు అడ్వెంచర్ చేసే కుర్రాడులా కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో ఒక సందర్భంలో మహేష్ బాబు తన కండ్లనైతే కోల్పోవాల్సి వస్తోందట. తర్వాత మళ్ళీ కండ్లు వస్తాయట.
బ్లైండ్ గా ఉన్నప్పుడు తను ఎలాంటి సాహసాలు చేశాడు. ప్రేక్షకులను ఎలా అలరించాడు అనేది ఈ సినిమాలో కీలకంగా మారబోతుందట. మొత్తానికైతే బ్లైండ్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఆయన చేసిన అడ్వెంచర్స్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిపోతాయి అంటూ రాజమౌళి చెప్పిన మాటలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు మహేష్ బాబు బ్లైండ్ గా ఏ సినిమాలో నందించలేదు. ఈ సినిమాలో నటించి తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మంచి నటనను కనబరిచి మరోసారి ఉత్తమ నటుడిగా నిలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక రాజమౌళి అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ హిట్ అవుతోందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…