Rajamouli And Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే దర్శకులలో రాజమౌళి ఒకరు… తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్న ఘనత కూడా తనకే దక్కుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ని నెంబర్ వన్ పొజిషన్ లో నిలిపిన ఘనత కూడా తనదే కావడం విశేషం… ఇక తన తోటి దర్శకులు సైతం అదే బాటలో నడుస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు… ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం… ఇక ఈ సినిమా కోసం ప్రపంచ ప్రేక్షకులందరు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడు సైతం రాజమౌళి ప్రతిభను గుర్తించిన విషయం మనకు తెలిసిందే. త్రిబుల్ ఆర్ సినిమా సమయంలో రాజమౌళి టాప్ పొజిషన్ కి వెళ్ళాడు. జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడు సైతం రాజమౌళి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు…ఇప్పుడు పాన్ వరల్డ్ లో వారణాసి సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.
1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలో రాజమౌళి ఉన్నాడు…మహేష్ బాబు వైఖరి మాత్రం రాజమౌళికి కొంతవరకు ఇబ్బంది పడుతుందని తెలుస్తోంది. మహేష్ బాబు రాజమౌళి అనుమతి లేకుండానే త్రిపుల్ ఆర్ సినిమాను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారట.
అలాగే సినిమా షూటింగ్ డేట్లు కూడా అతని వల్ల మార్చాల్సిన పరిస్థితి వస్తుందని, షెడ్యూల్ సైతం మార్చుకోవాల్సిన పరిస్థితి రావడం వల్ల రాజమౌళి కొంతవరకు మహేష్ బాబు మీద అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు రాజమౌళి ఏ ప్లాన్ చేసినా కూడా పర్ఫెక్ట్ గా దాన్ని ప్రెసెంట్ చేసేవాడు.
కానీ మహేష్ బాబు వల్ల అది తారుమారు అవుతుందని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. మొత్తానికైతే రాజమౌళి చాలా నిగ్రహంగా ఉంటూ ఎవ్వరిని ఒక్క మాట అనకుండా ఏ డిస్టబెన్స్ చేయకుండా తన సినిమాని సక్సెస్ ఫుల్ గా తీయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…