Sampath Raj: సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న నటుడిగా మారిన సంపత్ రాజ్(Sampath Raj) గురించి తెలియని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. ఈయన పేరు చెప్తే కొంతమంది గుర్తుపట్టలేకపోవచ్చు కానీ, ముఖాన్ని చూస్తే మాత్రం చిన్న పిల్లవాడు కూడా గుర్తు పట్టొచ్చు. అంతటి ఫేమస్ ఆయన. ఈయన టాలీవుడ్ కంటే ముందు కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీస్ లో అత్యధిక సినిమాలు చేసాడు. తెలుగు లో ఈయన ‘పంజా’ చిత్రం ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించాడు. ఆ తర్వాత దమ్ము, మిచ్చి, ఓం 3D, రన్ రాజా రన్, పవర్, లౌక్యం, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలా ఎన్నో చిత్రాల్లో నటించాడు. గత ఏడాది ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు కలిపి ఆరు సినిమాల్లో నటించాడు. ఈ ఏడాది ఎన్ని సినిమాల్లో నటించబోతున్నాడో చూడాలి.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘చాలా మంది హీరోలు, నా ముందు వాళ్ళు సరిపోరు అనే భయం తో నన్ను విలన్ గా తీసుకునేందుకు భయపడుతున్నారని సోషల్ మీడియా లో ఒక రూమర్ వచింది. అందులో ఎలాంటి నిజం లేదు. మహేష్ బాబు తో సహా, టాలీవుడ్ లో దాదాపుగా అందరి హీరోలతో నేను కనిపించాను. ప్రతీ ఒక్కరు స్పోర్టివ్ గా తీసుకొని ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడానికి అయినా సిద్ధం గా ఉన్నవాళ్లే. శ్రీమంతుడు చిత్రం నా కెరీర్ పై మిర్చి తర్వాత అత్యంత ప్రభావం చూపించిన సినిమా. మహేష్ బాబు నటన లైవ్ లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. మన ఇంట్లో మనుషులు కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, అంత సహజం ఉంటుంది మహేష్ నటన..ఆయన నటనకు నిజంగా నేను ఫిదా అయిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు బాగా నచ్చుతాడు. అతనితో కలిసి సినిమా చేసినా, చేయకపోయినా, కూర్చొని కాసేపు మాట్లాడితే చాలు అని అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంత గొప్ప డైరెక్టర్ ఆయన. గతం లో నేను ఆయన తో కలిసి చాలా సినిమాలు చేసాను. ఇప్పటికీ కూడా ఏదైనా క్వాలిటీ క్యారెక్టర్ దొరికితే కచ్చితంగా నా మైండ్ లోకి నువ్వే వస్తావు, నిన్నే నేను పిలుస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు సంపత్ రాజ్. ఇలా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.