Red Magic 11 Pro: చీకట్లో కూడా ఫోటో తీయొచ్చు. కాంతి తక్కువ ఉన్నచోట కూడా అద్భుతమైన వీడియో తీయొచ్చు. వ్లాగ్ లు, పనోరమ స్థాయిలో ఫోటోలు.. ఇంకా ఎన్నో పనులు చేయొచ్చు. అలాగని ఇదేమి డిజిటల్ వీడియో మేకర్ కాదు. జస్ట్ చేతిలో ఇమిడిపోయే ఫోన్..
నేటి కాలంలో డిజిటల్ ఉపకరణాల వాడకం పెరిగిపోయింది. అయితే ఫోన్ వచ్చిన తర్వాత అన్ని సౌలభ్యాలు అందులోనే ఉండడంతో.. చాలావరకు వినియోగదారులు అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు కూడా వినియోగదారుల మనసును ఆకట్టుకునే విధంగా ఫీచర్లను రూపొందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫోన్ మార్కెట్లోకి ఒక అద్భుతమైన ఫోన్ వచ్చింది.. దాని పేరు redmagic 11 Pro.. ఇందులో 24 జిబి ర్యామ్ ఉంది. గేమింగ్ క్రీడలను లక్ష్యంగా చేసుకొని ఈ ఫోన్ రూపొందించారు. అత్యంత అద్భుతమైన సామర్ధ్యాలతో దీనిని తయారు చేశారు.
బలమైన ప్రాసెసర్.. అడ్వాన్సుడ్ కూలింగ్ సిస్టం.. లాంగ్ గేమింగ్ బ్యాటరీ లైఫ్.. ఇవన్నీ ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణలు. షార్ప్లెన్స్.. ఆర్జిబి లైటింగ్.. ట్రాన్స్పరెంట్ స్టైల్ బ్యాక్ డిజైన్.. వంటివి ఈ ఫోన్ ను మరో స్థాయిలో నిలబెట్టాయి. ఎక్కువసేపు గేమింగ్ చేసినప్పటికీ చేతికి ఇబ్బంది కలగదు. ఇక షోల్డర్ ట్రిగ్గర్ బటన్లు గేమ్ ఆడుతున్నప్పుడు అద్భుతమైన అనుభూతి కలిగిస్తాయి.
ఈ ఫోన్లో అమోల్డ్ స్క్రీన్ ఉంటుంది. 144 హెచ్ జెడ్ రీ ఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. స్క్రీన్ మీద మూమెంట్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. 144 ఎఫ్ పి ఎస్ వరకు గేమ్ సపోర్టింగ్ ఉంటుంది. రంగులు కూడా అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వీడియోలు చూసేటప్పుడు కూడా విజువల్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. టచ్ రెస్పాన్స్ ను ఫాస్ట్ గా రూపొందించారు. అందువల్లే ప్రతి టచ్ కూడా వెంటనే రియాక్షన్ కనిపిస్తూ ఉంటుంది.
ఈ ఫోన్లో పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గంటల తరబడి ఉపయోగించవచ్చు. వీడియోస్ స్ట్రీమింగ్, సోషల్ మీడియా ను వాడినప్పటికీ కూడా ఈ ఫోన్ చార్జింగ్ అయిపోదు.
ఈ ఫోన్ ధర విషయానికి వస్తే గేమింగ్ విభాగంలో ఉండడంతో .. దరఖాస్తు ఎక్కువగానే ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఈ ఫోన్ ద్వారా సుమారు 899 డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మన దేశంలో అయితే 79, 999 రూపాయలకు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టం.. స్టీరియో స్పీకర్స్ ఆర్ జి బి లైట్స్.. కూలింగ్ స్టేటస్.. పెర్ఫార్మన్స్ లెవెల్స్ వంటివి ఈ ఫోన్ ను మరో స్థాయిలో నిలబెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.