Rajamouli- Ram Charan: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. కాగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో జరిగిన ఈ వేడుకకు రాజమౌళి ,ముఖ్య అతిధిగా వచ్చారు. ఐతే.. రాజమౌళి ఈ వేడుకలో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.

రాజమౌళి మాటల్లోనే.. ‘నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది కదా.. అయినా ఎందుకు ఇంత హంబుల్ గా ఉంటారని ?. మనకు తెలుసు.. ఆకాశం అంత ఎత్తు ఎదిగిన చిరంజీవి గారు.. అంత హంబుల్‌గా ఉంటే.. మనకి వచ్చిన సక్సెస్‌లు ఎంత ? మనం ఎంత తక్కువలో ఉండాలి ? చిరంజీవి గారు మనకి ఎన్నో నేర్పించారు.
Also Read: Thaman: అరెరే ఇలా అడ్డంగా బుక్ అయ్యావేంటి ‘తమన్’ ?
మనం ఎంత ఎత్తుకు ఎదిగినా నేల మీద నిలబడాలి అన్నది ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి. మీకు మళ్లీ చెబుతున్నా డైరెక్షర్‌కి ఎంత విజన్ ఉన్నా.. కథ ఎంత బాగా రాసుకున్నా.. టెక్నీషియన్స్ హెల్ప్ లేకపోతే ఏ డైరెక్టర్ ఏమీ చేయలేడు’ అంటూ రాజమౌళి ఎప్పటిలాగే హీరోలను పొగిడాడు. అయితే, జక్కన్న ముఖ్యంగా చరణ్ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఎలాంటి కామెంట్స్ చేశాడంటే.. ‘రామ్ చరణ్ గురించి నేను మూడు నెలల నుంచి చెప్తూనే ఉన్నాను. సరే.. ఇప్పుడు కొత్తగా చెప్పాలంటే.. మగధీర సినిమా టైంలో ఫస్ట్ కథ చిరంజీవి గారు విన్నారు. అప్పుడు నేను అనుకున్నాను. బహుశా చరణ్ విషయాలన్నీ చిరంజీవి గారు చూసుకుంటారు అని. ఈ మధ్య నేను కొత్తగా తెలుసుకున్నది ఏంటంటే.. చిరంజీవి గారు చరణ్‌కి ఎలాంటి సలహాలు ఇవ్వరు.

ఇలా చేయి.. ఇలా చేయొద్దు అని ఆయన ఎప్పుడు చరణ్ కి చెప్పరు. తనకు సంబంధించి ప్రతి నిర్ణయం చరణ్ దే. తాను తప్పులు చేస్తే తిరిగి తానే సరిదిద్దుకున్నాడు. డైరెక్టర్‌లు చెప్పింది విని తనకి తానుగా నేర్చుకున్నారు. చరణ్ మెగాస్టార్ కొడుకు అయ్యి ఉండొచ్చు. కానీ.. తనకి తానుగానే ఎదిగాడు. హార్ట్ వర్క్‌తోనే ఎదిగాడు.. తనని తాను నిరూపించుకున్నాడు.
చిరంజీవిగారి అంత ఎత్తుకు ఎదుగుతారో లేదో మనం చెప్పలేం.. కనీసం ఆయనతో సమానంగా ఉంటారని తప్పకుండా చెప్పొచ్చు’ అంటూ రాజమౌళి చరణ్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఐతే.. రాజమౌళి మాటల్లో అర్ధాన్ని బట్టి.. చరణ్ ను తండ్రి చాటు బిడ్డ అనే ట్యాగ్ లైన్ నుంచి బయట పడేయటానికే ఈ మాటలు అన్నట్టు అర్ధం అవుతుంది.
Recommended Videos:


