Thaman: కాపీ కొట్టడం అనేది తన జన్మ హక్కుగా పెట్టుకున్నట్లు ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ‘తమన్’. అసలు తెలుగు ఇండస్ట్రీలో కాపీ క్యాట్ అనగానే ముందుకు గుర్తుకొచ్చే పేరు తమన్. పాపం తమన్ ఎంతో కష్టపడి కాపీ కొట్టి ఒక పాటను రిలీజ్ చేస్తే.. వెంటనే దీని ఒరిజినల్ పాడండ్రా అంటూ ట్రోల్ మొదలు పెడుతుంటారు నెటిజన్లు. అందుకు తగ్గట్లుగానే తమన్ నుండి ఎలాంటి పాట వచ్చినా.. అది ఎక్కడో ఓ చోట నుంచి తమన్ కాపీ కొట్టినట్టు సాక్ష్యాలు దొరకడమే ఇక్కడ కొసమెరుపు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కి కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలోని మూడవ పాట విడుదలైంది. ఈ పాటని హారిక నారాయణ్ పాడారు. అయితే, ఈ పాటపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలకృష్ణ అఖండ సినిమాలో వచ్చే ఒక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంచెం ఈ పాటలో వచ్చే మ్యూజిక్ పోలి ఉంది. దాంతో సడన్ గా ఈ పాట వింటే అఖండ సినిమా మ్యూజిక్ గుర్తొస్తుంది.
Also Read: Devotional Tips: ఆంజనేయ స్వామిని పూజించే సమయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులివే?
అందుకే, తమన్ పై మళ్ళీ కాపీ క్యాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పెద్ద హిట్ పాటలను కూడా, కాపీ కొట్టాడనే విమర్శలు అందుకున్న ఘనత మాత్రం తమన్ దే. అయితే తన పై వస్తోన్న విమర్శలకు తమన్ ఓ రేంజ్ లో ఆన్సర్ ఇస్తూ.. ‘కాపీ ట్యూన్స్ ప్లే చేస్తే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా ? ‘కాపీ కొడితే.. నాకింతింత పారితోషికాలు ఇస్తారా’ ‘కాపీ కొడితే.. నాకొన్ని సినిమాలు వస్తాయా’ అంటూ లాజిక్కులు తీసి వివరణ ఇచ్చుకుంటుంటాడు తమన్.

కాకపోతే తనపై కాపీ ముద్ర పడినప్పుడల్లా తమన్ లాజిక్స్ ఇలాగే ఉంటాయి. కానీ ఆ తర్వాత పాట మాత్రం, కాపీ ట్యూన్ తోనే వస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వస్తోన్న తంతంగమే ఇది. అయినా తమన్ మాత్రం కాపీ చేసినట్టు ఒప్పుకోడు. పైగా ‘వాళ్లకి అంత దమ్ముంటే. వచ్చి కొత్తగా ఓ పాట క్రియేట్ చేసి చూపించమనండి’ అంటూ ఎదురు మండిపడుతుంటాడు.
ఎవడు పడితే వాడు వచ్చి కాపీ కొట్టాడంటే ఇక్కడ ఎవడూ వినేవాడు లేడు అంటూ ఫైర్ అవుతుంటాడు. నిజానికి అఖండ సినిమాకి కూడా తమనే సంగీత దర్శకుడు. మొత్తంగా తన పాటను తానే కాపీ కొట్టుకుంటూ ఇలా బుక్ అవుతున్నాడు తమన్, పాపం.
Also Read:Virat Kohli: క్రికెట్ కింగ్‌కు ఏమైంది.. మరోసారి కోహ్లీ గోల్డెన్ డకౌట్.. 14 ఏళ్లలో ఇదే తొలిసారి..!
https://www.youtube.com/watch?v=cwKdCqcF9v4&t=5s
Recommended Videos:



[…] Swathi Naidu- Chammak Chandra: జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర అంటే చాలా ఫేమస్. మొదటి నుండే సెటైరికల్ పంచులతో జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న చంద్ర తాజాగా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే జబర్దస్త్ లో వచ్చిన పేరుతో చమ్మక్ చంద్ర ఒక సెలబ్రెటీ హోదా లో కొనసాగుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనను గుర్తుపట్టని వారు ఉండరు. అంతలా ఫేమస్ అయ్యాడు చంద్ర. […]
[…] Srinidhi Shetty: యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ రెండూ కూడా కాసుల వర్షాన్ని కురిపించాయి. ఈ సినిమాలో హీరో యష్ సరసన శ్రీనిధి శెట్టి అనే అమ్మాయి నటించింది. అయితే కేజీఎఫ్ ముందు శ్రీనిధి గురించి కనీసం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌లో ఆమె నటించిన పాత్ర పరిధి చాలా చిన్నది. దీంతో సినిమా హిట్టయినా ఆటలో అరటిపండుగానే మిగిలిపోయింది. […]