Singer Harini’s Father Found Dead: ప్రముఖ సింగర్ హరిణి రావు కుటుంబంలో ఏమి జరుగుతుంది ? ఆమె తండ్రి ఏ.కే.రావు అనుమానాస్పద స్థితిలో మరణించడానికి గల కారణం ఏమిటి ? సింగర్ హరిణి రావు ఫ్యామిలీది ఉన్నతమైన కుటుంబమే. గతంలో ఎప్పుడు ఆ ఫ్యామిలీ ఎలాంటి న్యూస్ లో లేదు. కానీ, గత వారం నుంచి ఆ కుటుంబం జాడలేకుండా పోవడం అందర్నీ షాక్ కి గురి చేసింది.

అసలు ఏమి జరిగి ఉంటుంది ? ఆర్ధిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ? లేక, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? హరిణి రావు సన్నిహితులు మిత్రులు ప్రస్తుతం గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాడలేకుండా పోయిన హరిణి రావు కుటుంబంలో ఆమె తండ్రి ఏకే రావు మృతదేహం బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్ పై పడి ఉంది.
ఎంత దారుణం ? ఏకే రావు హైదరాబాద్ వాసి. మరి బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్ పై ఆయన బాడీని పోలీసులు గుర్తించడం ఏమిటి ? ఇంతకీ అయనది హత్యా ? లేక ఆత్మహత్యా ? కరెక్ట్ గా వారం క్రితం ఏకే రావు తన కుటుంబ సభ్యులతో సహా అదృశ్యమయ్యాడు. దాంతో ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: Drushyam Movie Esther Anil: ‘దృశ్యం’ భామ ‘ఎస్తేర్ అనిల్’ బయోగ్రఫీ !
పోలీసులు కూడా ఏకే రావు ఫ్యామిలీని వెతికే పనిలో పడ్డారు. కానీ, సడెన్ గా ఏకే రావు మృతదేహం బెంగుళూరు రైలు పట్టాల పై కనిపించే సరికి ఎవరికీ ఏమి అర్ధం కావడం లేదు. ఏకే రావు బాగా చదువుకున్న వ్యక్తి. పైగా ఆయన బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్ కు సీఈవో కూడా. ఏకే రావు సీఈవోగా చాలాకాలంగా పని చేస్తున్నారు.
ప్రస్తుతం ఏకే రావ కుటుంబ సభ్యులు గురించి పోలీసులు గాలిస్తున్నారు. ఏకే రావు కుమార్తె హరిణి హిందూస్తానీ గాయని. ఆమె జ్యో అచ్యుతానంద చిత్రంలో “ఒక లాలన ఒక దీవెన” అనే పాటను అద్భుతంగా ఆలపించారు.
Also Read: Lakshhya Movie: నాగ శౌర్య ” లక్ష్య ” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే ?