Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇక అలాంటి వాళ్ళలో రాజమౌళి ఒకరు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఆయన చేస్తున్న సినిమాలు భారీ విజలాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు…బాహుబలి(Bahubali), త్రిబుల్ ఆర్ (RRR) సినిమాలతో ఆయన కంటు ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని ఒకెత్తయితే ఇక మీదట మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశారు. మరి రెండో షెడ్యూల్ కోసం ప్రణాళికలు రూపొందించుకుంటున్న సమయంలో మహేష్ బాబు వెకేషన్ కోసం ఇటలీ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే…ఇప్పుడు ఆయన తిరిగి రావడంతో తొందరలోనే సినిమాకి సంభందించిన రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలనే ప్రణాళిక రూపొందించుకుంటున్నాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఇండియా కి మాత్రమే పరిమితమైనప్పటికి ఇప్పుడు చేస్తున్న సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్న స్టార్ డైరెక్టర్లందరి కంటే కూడా రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా విషయంలో కొంతవరకు హర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మహేష్ బాబు తను చెప్పిన వినకుండా వెకేషన్ కు వెళ్ళాడు.అలాగే రాజమౌళి చెప్పినట్టుగా ఫాలో అవ్వడం లేదట.
Also Read : ఆ మూడు సినిమాలను జపాన్ లో ప్రమోట్ చేస్తున్న రాజమౌళి…కారణం ఏంటంటే..?
దానివల్ల ఆయన కొంతవరకు ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో మహేష్ బాబు లాంటి హీరోకి ఆ అవకాశం వచ్చింది.
ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పటికి మహేష్ బాబుకి వెకేషన్స్ కి వెళ్లడం చాలా అలవాటు…కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కూడా వెకేషన్ కి వెళ్లి మళ్లీ తొందరగానే వచ్చాడు. మరి తొందరగా రాజమౌళి ఈ సినిమా షూట్ ని స్టార్ట్ చేస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక మీదట మహేష్ బాబు రాజమౌళి బయటికి వదిలి ప్రసక్తే లేనట్టుగా తెలుస్తోంది. మరి ఏదేమైనా కూడా మహేష్ బాబు రాజమౌళి చెప్పినట్టుగా వినాల్సిందే. ఇక రెండు సంవత్సరాల పాటు మహేష్ బాబు రాజమౌళికి సరెండర్ అవ్వాల్సిందే అంటూ తన అభిమానులు సైతం అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
Also Read : టాలీవుడ్ హీరోలపై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్..