Rajamouli: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్థాయి అనేది ఒక్కసారిగా తరా స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదిగిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రాబోయే సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించడమే కాకుండా ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసే విధంగా మన తెలుగు సినిమాలు ముందుకు సాగబోతున్నాయి అనేది వాస్తవం…
Japan: అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న సినిమా కోసం రిస్క్ చేస్తున్నారా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. త్రిపుల్ ఆర్ (RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన సత్తా ఏంటో చూపించాడు… త్రిబుల్ ఆర్ సినిమా ఇండియాలోనే కాకుండా జపాన్ లో కూడా విపరీతమైన కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. అక్కడ రాజమౌళికి చాలా మంచి క్రేజ్ అయితే దక్కింది. ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ‘త్రిబుల్ ఆర్ బిహైండ్ అండ్ బియాండ్’ (RRR Behind and Beyond)అనే డాక్యుమెంటరీని ఇంతకుముందే ఇంగ్లీషులో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు జపాన్ లో కూడా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజమౌళి జపాన్ వెళ్లాడు. అక్కడ మీడియాతో మాట్లాడిన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఇక దానితో పాటుగా ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటూ రాజమౌళిని ఒక ప్రశ్న అడగగా ఆయన దానికి సమాధానం చెబుతూ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ (Dragon), అలాగే సందీప్ రెడ్డి వంగ – ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ (Spirit) రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది (Peddi) సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పడం విశేషం…
ఈ మూడు సినిమాలు కూడా తెలుగు సినిమాలే కావడం వల్ల ఈ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ అయితే ఉందని రాజమౌళి చెప్పకనే చెప్పాడు. ఇక దానికి తోడుగా ఈ సినిమాలకు జపాన్ లో కూడా మార్కెట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఇలాంటి కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక పాన్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు సత్తా చాటాలనే ఆయన అలా చెప్పినట్టుగా తెలుస్తోంది…
మరి మొత్తానికైతే ఈ సినిమాలతో మరోసారి మన తెలుగు హీరోలు దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రాజమౌళి మాత్రం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ ని కేటాయించాడు.
ఇక ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుమ్రోగిపోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. అందుకోసమే రాజమౌళి దానికి సంబంధించిన పూర్తి వర్కు చేసే పనిలో నిమగ్నమై పోయాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటుగా పృధ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు కూడా నటిస్తూ ఉండడం విశేషం…