SSMB 29 Glimpses: ఒక సినిమాతో సక్సెస్ ని సాధించడం అంటే ఆషామాషీ వ్యవహారమైతే కాదు. అలాంటిది ఇప్పటి వరకు చేసిన 12 సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఏకైక దర్శకుడు రాజమౌళి… పాన్ ఇండియా నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించడం విశేషం…ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో చాలావరకు సన్నివేశాలను పూర్తి చేశారట. మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని నవంబర్ నుంచి ఇస్తానని మొదట్లోనే కన్ఫర్మ్ చేసిన రాజమౌళి ఇప్పుడు ఈ సినిమా గ్లింప్స్ ని తొందర్లో రిలీజ్ చేయాలనే సన్నాహాలు చేస్తున్నాడు…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాజమౌళి నుంచి వచ్చే సినిమాకి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను 1000 కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో 3,000 కోట్లకు పైన కలెక్షన్స్ ను సాధించాలనే సంకల్పంతో బరిలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక రాజమౌళి ఇప్పుడు ఏ సినిమా చేసిన కూడా అదొక పెను సంచలనంగా మారుతోంది. కాబట్టి ఈ సినిమా మీద ఇండియా వైడ్ గా భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా గ్లింప్స్ ను సైతం హాలీవుడ్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు…
డిసెంబర్ లో ‘అవతార్ 3’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నవంబర్ లో ఆయన ప్రమోషన్స్ కోసం ఇండియాకి రానున్నారు. ఇక అందులో భాగంగానే హైదరాబాద్ కి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఆ సమయంలోనే ఈ సినిమా గ్లింప్స్ ని రిలీజ్ చేయించి సినిమా మీద భారీ హైప్ తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక జక్కన్న ఏది చేసిన అదొక సెన్సేషనల్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…