Rajamouli Mahesh Babu Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటులు చాలా మంది ఉన్నారు. అయినప్పటికి ఎవరికి వారు ఎలాంటి సినిమాలు చేయాలి అనే దానిమీద సరైన క్లారిటీని తెచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకుంటున్న వాళ్ళు సైతం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.
Also Read: ఒక్క AMB సినిమాస్ తో మహేష్ బాబు ఇంత సంపాదిస్తున్నాడా..?
మరి ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశాడు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఆ పోస్టర్ లో మహేష్ బాబు ముఖం కనిపించకపోయిన కూడా ఆ పోస్టర్ ను చూసిన మహేష్ అభిమానులు ఆనందపడేలా చేస్తున్నాడు.
ఇక మహేష్ బాబు మెడలో త్రిశూలం, డమరుకం, నంది ఆకారాలతో ఒక దండైతే ఉంది. ఇక మహేష్ బాబు మెడ దగ్గర నుంచి రక్తం కారుతున్నట్టుగా ఉంది. అంటే ఇది ఒక ఫైట్ సీక్వెన్స్ కి సంబంధించిన పీక్ గా తెలుస్తోంది. మరి దీని ద్వారా రాజమౌళి ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ఇందులో భక్తి భావాన్ని కూడా కలిపి సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా దేవుళ్లను ఆధారంగా చేసుకొని ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నాయి అనేది కూడా ఈ పిక్ ద్వారా మనకు ఒక హిట్ అయితే ఇస్తున్నాడు.
మరి ఈ పిక్ చూసిన రాజమౌళి అభిమానులు సైతం చాలా ఆనందపడుతూ తప్పకుండా భారీ విజయాన్ని సాధిస్తోంది అంటూ మంచి కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి ఈ సినిమాను భారీ సక్సెస్ గా నిలుపడానికి భారీ ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది…