Pawan Kalyan Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో హిట్స్, ఇండస్ట్రీ హిట్స్, ఫ్లాప్స్, డిజాస్టర్స్ ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) లాంటి బ్లాక్ మార్క్ ఆయన కెరీర్ లో మళ్ళీ ఎంత కోరుకున్న రాదు, ఏఎం రత్నం తో మరో సినిమా చేస్తే తప్ప. ఆయన్ని కూడా పూర్తి స్థాయిలో తప్పుబట్టలేం, పవన్ కళ్యాణ్ తప్పు కూడా ఎంతో కొంత ఉంది. ప్లాన్ ప్రకారం చూసుకుంటే ఈ చిత్రం కేవలం 80 రోజుల్లో పూర్తి అవ్వాలి. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ క్రిష్ ప్రణాళికలు వేసాడు, శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను నడిపించాడు. కానీ మధ్యలో కరోనా మహమ్మారి రావడంతో లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యాక ఆయన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు కాకుండా, తన దృష్టిని కేవలం ‘హరి హర వీరమల్లు’ మీద పెట్టుంటే బాగుండేది.
Also Read: ఒక్క AMB సినిమాస్ తో మహేష్ బాబు ఇంత సంపాదిస్తున్నాడా..?
కానీ ముందుగా ఆయన ఆ రెండు సినిమాలను పూర్తి చేసాడు. దీని వాళ్ళ ‘హరి హర వీరమల్లు’ వెనక్కి వెళ్ళింది. ఇది పవన్ కళ్యాణ్ చేసిన మొదటి తప్పు. ఇక ఆ తర్వాత ఎన్నికల సమయం దగ్గర పడింది. ఇక తన పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాల్సి వచ్చింది. దీంతో తన సమయం మొత్తం వృధా అవుతుండడం తో డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఆరోజే ఈ చిత్రం చనిపోయింది. నిర్మాత AM రత్నం కూడా అక్కడితో ఈ సినిమాని ఆపేసి ఉండుంటే బాగుండేది. పవన్ కళ్యాణ్ కూడా ఆపేద్దాం అనే మూడ్ లోనే ఉన్నాడు. కానీ ఇంతలోపు రత్నం తన కొడుకు జ్యోతి కృష్ణ ప్రస్తావన తీసుకొచ్చాడు. మా అబ్బాయి సెకండ్ హాఫ్ గురించి అద్భుతమైన స్టోరీ ని రాసుకున్నాడు, ఒకసారి వినండి అని పవన్ కళ్యాణ్ తో అన్నాడట.
సరే పిలిపించు అని పవన్ కళ్యాణ్ పిలిపించాడు. జ్యోతి కృష్ణ కథ ని వివరించాడు. ఆయనకు తెగ నచ్చింది, అలా ఈ సినిమా రీ స్టార్ట్ అయ్యింది. అయితే AM రత్నం కి ఈ సినిమా పూర్తి అయ్యేలోపు, కొత్త అప్పులు,పాత అప్పులు అన్నీ ఒకేసారి మీదకొచ్చి పడ్డాయి. ఫలితంగా సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల అనగా, అప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. కొన్నవారు అడ్వాన్స్ లు ఇవ్వడం లేదు. ఫైనాన్సియర్ కి ఎట్టి పరిస్థితి లో 70 కోట్లు చెల్లించాలి,లేదంటే సినిమాని విడుదల చెయ్యనివ్వడు, ఇక ఏమి చెయ్యలేని స్థితిలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి రోధించాడట AM రత్నం. దీంతో అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చేత, AM రత్నం ఫైనాన్షియర్ కి 70 కోట్ల రూపాయిలు చెల్లించి, విశ్వప్రసాద్ కి బాండ్ పేపర్ రాసిచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ 70 కోట్లు ఇవ్వాలి, లేదంటే ఆ బ్యానర్ లో ఒక సినిమా చెయ్యాలి. ఇలా ఇప్పుడు పవన్ పై 70 కోట్ల భారం ఉంది.