Mahesh Babu: #RRR సినిమా తర్వాత రాజమౌళి తన తర్వాతి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరి కాంబినేషన్ కోసం కేవలం మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాదు,ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..రాజమౌళి అనే పేరు ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక్క పెద్ద బ్రాండ్..ఈయన సినిమా వస్తుంది అంటే చాలు చిన్నపిల్లల నుండి పండు ముసలోళ్ల వరుకు థియేటర్స్ కి క్యూ కట్టేస్తారు..అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు అనే పేరు మరో పెద్ద బ్రాండ్..యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ వేరు..అలాంటి రెండు అతి పెద్ద బ్రాండ్స్ ఏకం అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల ప్రభంజనం ఉంటుందో మన ఊహకి కూడా అందదు..వచ్చే ఏడాది సెప్టెంబరు నెల నుండి ఈ సంచలన ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇది ఇలా ఉండగా రాజమౌళి మహేష్ బాబు తో ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడు అనేది అప్పుడు అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠ..తన సినిమా స్టోరీలను విడుదలకి ముందే ప్రెస్ మీట్ పెట్టి అభిమానులకు చెప్పడం రాజమౌళి స్టైల్..మహేష్ బాబు సినిమా షూటింగ్ మొదలు అయ్యే ముందు ఎలాగో స్వయంగా ఆయనే ఈ సినిమా స్టోరీ చెప్తాడు అనుకోండి, కానీ ఇటీవలే ఒక్క ఇంటర్వ్యూ లో మహేష్ బాబు తో నేను తియ్యబోయ్యే సినిమా యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది అని ఒక్క హింట్ ఇచ్చాడు..దీనితో అభిమానులు పలు హాలీవుడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాలను గుర్తు తెచ్చుకొని తమ హీరోని ఇలా చూడబోతున్నాము అంటూ మురిసిపోయారు..కానీ లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ఏమిటి అంటే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కథ పట్ల మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది..ఆయన తన సినిమాకి యాక్షన్ అడ్వెంచర్ థీమ్ ని తీసుకునే ఆలోచన ని విరమించుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

యాక్షన్ అడ్వెంచర్ థీమ్ కంటే మరో అద్భుతమైన స్టోరీలైన్ మైండ్ లోకి వచ్చింది అని , ఆ లైన్ మీద స్క్రిప్ట్ ని లాక్ చేసి డెవలప్ చేద్దాం అని తన తండ్రికి చెప్పాడట రాజమౌళి..ఈ స్క్రిప్ట్ డెవలప్ చేసాక మహేష్ కి వినిపించి, ఆయన ఒప్పుకున్నాక సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి..ఇంతకీ రాజమౌళి కి మైండ్ లో పుట్టిన ఆ అద్భుతమైన స్టోరీ లైన్ ఏమిటి అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది..రాజమౌళి ఏమి చేసిన పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి తమ హీరో తో ఎలాంటి జానర్ సినిమా చేసిన మాకు ఇష్టమే అంటూ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు..ప్రస్తుతం మహేష్ బాబు హీరో నటించిన సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసి వచ్చే నెల 12 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధం గా ఉంది..ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ తో ఒక్క మూవీ చెయ్యబోతున్నారు..ఈ రెండు సినిమాలు పూర్తి యయిన తర్వాత రాజమౌళి సినిమా సెట్స్ లోకి అడుగుపెడతాడు మహేష్ బాబు.
Recommended Videos:


