Husbands Fall In Love With A Other Woman: ఇటీవల కాలంలో మానవ సంబంధాల్లో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. పూర్వ కాలంలో భార్య అయినా భర్త అయినా ఒకసారి వివాహం చేసుకుంటే కడదాకా వారి వెంటే ఉండేవారు. కానీ కాలక్రమంలో విపరీత బుద్ధులు వస్తున్నాయి. మనిషి కోరికలకు అంతు లేకుండా పోతోంది. ఫలితంగా పరాయి మహిళ, భర్తపై కన్ను పడుతోంది. దీంతో అక్రమ సంబంధాల పట్ట పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కుటుంబాల్లో నిత్యం గొడవలే ప్రధానంగా ఉంటున్నాయి. అరమరికలు లేకుండా దాపరికాలు రాకుండా ఉండాల్సిన సంసారాలు వీధికెక్కుతున్నాయి. గొడవలే ప్రధానంగా ఉంటున్నాయి. దీంతో పచ్చని సంసారాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి.

భార్య, భర్త ప్రవర్తనలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పరాయి మహిళ, మగాడి మాయలో పడితే అంతే సంగతి. పెళ్లాం చెప్పింది వినరు. అన్ని విషయాల్లో విభేదిస్తారు. ఎప్పుడు లొల్లి పెట్టుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. అవసరమైతే కడతేర్చడానికి కూడా వెనకడాడరు. పని చేసే ప్రదేశాల్లో ఇతర మహిళలతో సంబంధం పెట్టుకునే అవకాశాలున్నందున వారిపై ఓ కన్నేసి ఉంచడం భావ్యమే. ప్రసవం సమయాల్లో కూడా పురుషులు పరాయి మహిళల వెంట పడి కట్టుకున్న దానికి అన్యాయం చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా భర్తను ఒ కంట కనిపెట్టాలి.
ఆఫీసుల్లో తప్పు చేసే భర్త, భార్య ఇంటికి వచ్చాక జీవితభాగస్వామితో లేని ప్రేమను ఒలకబోస్తారు అలాంటి సమయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు ప్రేమ నటిస్తున్నారో ఆరా తీయాలి. అప్పుడప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తేడా వస్తుంటే ఓ కన్నేసి ఉంచాలి. ఏం ఖర్చులు పెడుతున్నారో కనుక్కోవాలి. అలాంటప్పుడు కూడా రెండో సెటప్ కోసం తెగ ఖర్చు చేస్తుంటారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే మనకే నష్టం.
ఇంకా కొందరైతే యాభైలోకి వచ్చినా ఇంకా కుర్రవాడిలా ఉండాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో సైతం ఓ లుక్కేయాలి. ఎందుకు ఇంతలా రెడీ అవుతున్నారనే దానిపై కూపీ లాగితే విషయం బయటకు వస్తుంది. ఇలా ఆడవారైనా మగవారైనా పక్క దారులు తొక్కుతుంటే వారిని కట్టడి చేయడం జీవితభాగస్వామిగా మన పనే. అందుకే వారి ప్రవర్తన పట్ల ఓ కన్నేసి వారిని తప్పులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుందని తెలుసుకోవాలి.