SS Rajamouli David Warner : డేవిడ్ వార్నర్(David Warner)..పేరుకే ఈయన ఆస్ట్రేలియన్ క్రికెటర్..కానీ ఇతనికి ఇండియా లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ వార్నర్ పేరు చెప్తే మెంటలెక్కిపోతారు. ఎందుకంటే ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ టీం కి కెప్టెన్ గా వ్యవహరించి రెండు సార్లు కప్ అందించాడు. అతని బ్యాటింగ్ స్టైల్ అంటే మన తెలుగు ఆడియన్స్ కి ఎంతో ఇష్టం. అంతే కాదు, వార్నర్ కి మన తెలుగు సినిమాల పిచ్చి మామూలుగా ఉండదు. ఏదైనా స్టార్ హీరో ఫస్ట్ లుక్ విడుదలై బాగా వైరల్ అయితే చాలు, దానిని స్పూఫ్ చేస్తూ తన సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గానే ఈయన నితిన్ హీరో గా నటించిన ‘రాబిన్ హుడ్’ చిత్రం లో కూడా ఒక కీలక పాత్ర పోషించిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ఆ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా, కాస్తో కూస్తో వసూళ్లు వచ్చాయంటే ఎందుకంటే కారణం డేవిడ్ వార్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు ముందు ఆయన డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) తో కలిసి ‘kred’ యాప్ కి ప్రమోషన్ చేసాడు. రాజమౌళి దర్శకత్వం చేస్తున్నట్టు, డేవిడ్ వార్నర్ బాహుబలి క్యారక్టర్ చేస్తున్నట్టు, చాలా ఫన్నీ గా క్రియేట్ చేసిన ఈ యాడ్ వీడియో కి అప్పట్లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. వార్నర్ చాలా క్యూట్ గా చేసాడు అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. అయితే రీసెంట్ గా డేవిడ్ వార్నర్ తన ఇన్ స్టాగ్రామ్ లో మరో ఆసక్తికరమైన పోస్ట్ చేసాడు. బాహుబలి చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి మేకర్స్ ఆడియన్స్ ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఈ సందర్భంగా గతంలో వార్నర్ రాజమౌళి తో కలిసి చేసిన యాడ్ వీడియో కి సంబంధించిన బాహుబలి కాస్ట్యూమ్స్ ని మరోసారి సోషల్ మీడియా లో పంచుకున్నాడు.
అంతే కాకుండా ఒక క్యాప్షన్ పెడుతూ ‘నేను కిరీటం ధరించిన ఫోటో బాగుందా?, లేకపోతే మామూలుగా ఉన్న ఫోటో బాగుందా?’ అని అడుగుతాడు. అప్పుడు దానికి రాజమౌళి సమాధానం ఇస్తూ ‘హాయ్ డేవిడ్..మీరు మాహిష్మతి సామ్రాజ్యానికి నిజమైన రాజుగా తయారయ్యే సమయం ఆసన్నమైంది. నేను మీ కోసం ఈ కిరీటాన్ని బహుమతిగా పంపుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు వార్నర్ సమాధానం ఇస్తూ ‘నిజమా..పంపండి..ఎదురు చూస్తూ ఉంటాను’ అని బదులిచ్చాడు. అప్పుడు బాహుబలి టీం రెస్పాన్స్ ఇస్తూ ‘మీ ఆస్ట్రేలియా లో బాహుబలి సినిమాని మరోసారి చూడండి’ అంటూ కామెంట్ చేసింది.