Rajamouli First Salary: ప్రస్తుతం ఇండియా లో స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ని, మార్కెట్ ని సంపాదించుకున్నది ఎవరంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి(SS Rajamouli). ఒక తెలుగువాడిగా రాజమౌళి మన ఇండస్ట్రీ కి చెందిన వాడు అని చెప్పుకోవడం మన అందరికీ ఎంతో గర్వ కారణం. కానీ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా , ఎంత పెద్ద హీరో అయినా మొదలయ్యేది సూన్యం నుండే. బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేని వారికి అయితే కనీసం తినడానికి అన్నం నీళ్లు కూడా కెరీర్ ప్రారంభం లో ఉండేవి కావు. రాజమౌళి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఏమి రాలేదు. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీ లోనే పెద్ద రచయితా. అదే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా బంధువే. అయినప్పటికీ సూన్యం నుండే తన కెరీర్ ని మొదలు పెట్టాడు రాజమౌళి.
Also Read: ఆ హీరోయిన్ తో సినిమా చేసి చాలా పెద్ద తప్పు చేశా అంటూ శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్!
ఆయన తన కష్టార్జీతం తో మొట్టమొదటి సంపాదించిన డబ్బుల గురించి నిన్న ‘కుబేర'(Kubera Movie) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. యాంకర్ సుమ రాజమౌళి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ మొట్టమొదటి జీతం ఎంతో తెలుసుకోవచ్చా’ అని అడగ్గా, దానికి రాజమౌళి సమాధానం చెప్తూ ‘ నేను అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేస్తున్నప్పుడు 50 రూపాయిలను మొట్టమొదటి జీతం గా అందుకున్నాను’ అని అంటాడు. అప్పుడు సుమ ‘ఆ 50 రూపాయలతో ఏమి చేసారు సార్’ అని అడగ్గా, ఏమో సరిగా గుర్తు లేదు అంటూ బదులిచ్చాడు రాజమౌళి. అలా 50 రూపాయిల రెమ్యూనరేషన్ తో మొదలైన రాజమౌళి కెరీర్, నేడు వందల కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఒక సినిమాకు ఆయన సంతకం చేసాడంటే, రెమ్యూనరేషన్ కాదు, లాభాల్లో వాటాలు ఇవ్వాలి. #RRR చిత్రానికి వెయ్యి కోట్ల రూపాయిలు వచ్చాయి. ఇందులో కేవలం రాజమౌళి షేర్ 200 కోట్లు ఉంటుంది.
మన దగ్గరున్న అద్భుతమైన ప్రతిభకు అదృష్టం తోడు అయితే ఏ స్థాయికి వెళ్తారో చెప్పడానికి రాజమౌళి ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ని అంతర్జాతీయ స్థాయిలో ఆయన తెరకెక్కిస్తున్నాడు. అంటే హాలీవుడ్ లో కూడా విడుదల అవ్వబోతుంది అన్నమాట. ఇప్పటికే #RRR చిత్రం తో మన తెలుగు సినిమాకు హాలీవుడ్ లో ఖాతా తెరిచాడు. ఇప్పుడు మహేష్ తో తీస్తున్న సినిమా సక్సెస్ అయితే వేల కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయి. అందులో రాజమౌళి వాటా వెయ్యి కోట్లు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎక్కడ 50 రూపాయిలు, ఎక్కడ వెయ్యి కోట్ల రూపాయిలు?, మీరే ఆలోచించండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉంటుందా?.
Also Read: శేఖర్ కమ్ముల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన రాజమౌళి…అదేంటండి అలా అనేసారు…