Akhanda 2 vs Vishwambhara :తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చేది ఇద్దరు హీరోలే. ఒకరు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మరొకరు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna). ఈ ఇద్దరి సినిమాలు ఇప్పటి వరకు ఎన్నో సంక్రాంతి బరిలో దిగాయి. అత్యధిక శాతం చిరంజీవి నే పై చేయి సాధించాడు. రీ ఎంట్రీ తర్వాత ఈ ఇద్దరు రెండు సార్లు సంక్రాంతి బరిలో పోటీ పడితే, రెండు సార్లు కూడా భారీ మార్జిన్ తో మెగాస్టార్ చిరంజీవి పై చెయ్యి సాధించాడు. కానీ బాలకృష్ణ సినిమాలు కూడా చిరంజీవి సినిమాలను సంక్రాంతి బరిలో చితక్కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మెగా మరియు నందమూరి అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని క్లాష్ ‘నరసింహనాయుడు’, ‘మృగరాజు’ మధ్య పోటీ. ఈ రెండు సినిమాల ఫలితాలు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అనుకుంట. అయితే ఇన్నాళ్లకు బాలయ్య బాబు చిరంజీవి మీద పై చెయ్యి సాధించే అవకాశం ‘అఖండ 2′(Akhanda 2 Movie) ద్వారా వచ్చింది.
బాలయ్య కెరీర్ ని కీలక మలుపు తిప్పిన చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత విడుదలై సంచలన విజయం సాధించింది. ఇంతకు ముందు బాలయ్య సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ మాత్రమే చూసేవారు. కానీ ‘అఖండ’ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎగబడి చూసారు. అందుకే ఆ చిత్రానికి అతి తక్కువ టికెట్ రేట్స్ మీద కూడా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ గా ‘అఖండ తాండవం’ తెరకెక్కింది. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా టీజర్ కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది.
కానీ మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర'(Vishwambhara Movie) చిత్రానికి మాత్రం మార్కెట్ లో ‘అఖండ 2’ కి ఉన్నంత క్రేజ్ లేదు. కారణం టీజర్ దారుణంగా మిస్ ఫైర్ అవ్వడం వల్లే. అభిమానుల్లో కూడా ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. అందుకే ప్రస్తుతానికి ‘అఖండ 2 ‘ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ పట్ల ‘విశ్వంభర’ పై భారీ మార్జిన్ తీసుకుంది. అదంతా సీక్వెల్ హైప్ వల్ల మాత్రమేనని, ‘విశ్వంభర’ చిత్రం కచ్చితంగా అందరినీ విడుదల తర్వాత సర్ప్రైజ్ చేస్తుందని, ఎప్పటి లాగానే చిరంజీవి బాలయ్య మీద చాలా తేలికగా పై చెయ్యి సాధిస్తాడని అంటున్నారు మెగా ఫ్యాన్స్. మరి ఈ రెండిట్లో ఏది నిజం అవుతుందో చూడాలి. సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో కూడా తెలియదు , అప్పుడే ఈ రెండు చిత్రాల పై బెట్టింగ్స్ వేసుకుంటున్నారు అభిమానులు.