Rajamouli comments on shekhar kammula : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ‘ స్టూడెంట్ నెంబర్ వన్’ (Student Number One) సినిమా నుంచి త్రిబుల్ ఆర్ (RRR) సినిమా వరకు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తూ ఉండటం విశేషం…ప్రస్తుతం ఆయన మహేష్ బాబు (Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసిన ఆయన తొందరలోనే మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి సాధ్యం కానీ రికార్డులను క్రియేట్ చేస్తూ తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకున్నాడు. కానీ వరల్డ్ సినిమా స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్లాలనే ప్రయత్నంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఆయనతో పాటు మంచి సినిమాలను చేస్తూ డీసెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల (Shekar Kammula)…
ఈయన తన కెరియర్ లో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఆయనకు సపరేట్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన సినిమాలో నటించడానికి చాలామంది హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్, నాగార్జునలతో కుబేర (Kubera) సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ఈనెల 20 వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ ఈవెంట్ కి హాజరైన రాజమౌళి శేఖర్ కమ్ముల గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. మీరు నమ్ముకున్న సిద్దాంతాల మీదనే సినిమాలను చేస్తూ ఉంటారు. నేను నమ్మిన సిద్ధాంతాలతో సినిమా చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతున్నాను అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఒక రకంగా రాజమౌళి నాకంటే మీరే గొప్ప అనే రేంజ్ లో శేఖర్ కమ్ముల గురించి మాట్లాడటం శేఖర్ కమ్ముల అభిమానులను ఆనందపరుస్తోంది. రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు ప్రపంచ స్థాయిలోకి వెళుతున్న ఆయన అలాంటి మాటలు చెప్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…