Chatrapathi Sekhar: తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొంది పాన్ ఇండియా రేంజ్ లో తనదైన మార్క్ చూపిస్తూ ప్రస్తుతం ఇండియాలో ఉన్న డైరెక్టర్లు అందరిలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఆయన ఒక సీరియల్ డైరెక్టర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు అంటే ఆయన టాలెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినమాని పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించే సినిమా తో వరల్డ్ లో ఉన్న బెస్ట్ డైరెక్టర్ల లో తను కూడా ఒక మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాలని చూస్తున్నాడు.ఇక ఈ క్రమంలో రాజమౌళి తన సినిమాలో రెగ్యులర్ గా ఒక నటుడిని ఎప్పుడు తీసుకుంటూ ఉంటాడు.ఆయన ఎవరు అంటే ఛత్రపతి శేఖర్ రాజమౌళికి తనకు ఇండస్ట్రీకి రాక ముందు నుంచే మంచి ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల తన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో అయిన రాజమౌళి తనని తీసుకుంటూ ఉంటాడు.
అయితే బాహుబలి సినిమా టైంలో రాజమౌళి శేఖర్ ని పిలిచి ఒక క్యారెక్టర్ ఇస్తున్నాను అని చెప్పి ఆశ పెట్టించి తీరా టైం కి రాజమౌళి శేఖర్ తో నువ్వు ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వవు శేఖర్ అందుకే ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇస్తున్న అని చెప్పడంతో శేఖర్ బాగా బాధపడిపోయాడు.ఇక దాంతో రాజమౌళి నెక్స్ట్ సినిమాలో మనం మళ్ళీ కలిసి చేద్దాం అని శేఖర్ కి చెప్పి తనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ శేఖర్ మాత్రం ఈ విషయంలో చాలా బాధపడ్డట్టుగా చెప్పాడు.
ఇక ఈ విషయంలో రాజమౌళి నన్ను మోసం చేశాడు అని తనకు తానే అనుకొని సైలెంట్ గా ఇంటికెళ్లిపోయి ఒక రెండు, మూడు రోజుల దాకా ఇదే మనస్థాపానికి గురై బాధపడ్డట్టుగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.కానీ రాజమౌళి ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాలో తనకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి అతనిని ఎంకరేజ్ చేశాడు… ఇలా రాజమౌళి, శేఖర్ మధ్య మంచి సన్నిహిత్య ఉంది.అందుకే శేఖర్ కి ఛత్రపతి సినిమాలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ గా మంచి క్యారెక్టర్ ఇచ్చి తనని ఎంకరేజ్ చేశాడు…