Mahesh Babu: మహేష్ బాబు హీరో కాకుంటే ఏం అయ్యేవాడో తెలుసా?

గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు మహేష్. ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఇలా సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హోదాను సంపాదించారు.

Written By: Suresh, Updated On : November 22, 2023 1:14 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోకి తండ్రి కృష్ణ నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్నారు. ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారో లేదో స్టార్ గా నిలవడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఆయన మంచితనం, నటనా చాతుర్యం రెండు కూడా ఇప్పుడు స్టార్ హోదాలో నిలబెట్టాయి. బడా నిర్మాతల ఛాన్స్ కూడా మహేష్ ఉండటం గమనార్హం. ఇక మహేష్ నటించిన సినిమాలు రీసెంట్ గా డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకోవడంతో ఆయన అభిమానులు తెగ ఆందోళన చెందారు. దీంతో ప్రస్తుతం గుంటూరు కారం సినిమాపైనే అందరు హోప్స్ పెట్టుకున్నారు. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.

గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు మహేష్. ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఇలా సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హోదాను సంపాదించారు. మరి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోతే మహేష్ బాబు ఏ ఫీల్డ్ ను ఎంచుకునేవారు అనే అనుమానం చాలా మందిలో ఉంది. అయితే ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్కరు చిన్నప్పుడే ఏ వృత్తిలోకి రావాలో నిర్ణయం తీసుకుంటారు. అదే విధంగా మహేష్ కూడా డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట.

దానికి సంబంధించిన చదువు కూడా చదివి మంచి డాక్టర్ అయ్యి పేదలకు ఉచిత వైద్యం చేయాలని ఎన్నో కలలు కన్నారట. కానీ అనూహ్యంగా ఆయన నిర్ణయం సినిమాల వైపు వెళ్లింది. తన తండ్రి కృష్ణ మేకప్ వేసుకొని సినిమా షూటింగ్ లకు వెళ్తుంటే తండ్రిని చూసి ఆయనకు కూడా మేకప్ వేసుకోవాలి అనిపించిందట. అంతే కాదు తండ్రితో కలిసి షూటింగ్ లకు కూడా వెళ్లేవారు మహేష్. అలా సినిమా షూటింగ్ లో జరిగేటప్పుడు చూసి మహేష్ బాబు ఆకర్షితుడై ఎలాగైనా సినిమాల్లో స్టార్ అవ్వాలి అనుకున్నారట.

మహేష్ బాబు వయసు పెరుగుతుంటే సూపర్ స్టార్ కృష్ణకు కూడా కొడుకును స్టార్ ను చేయాలి అనిపించేదట. అలా మొత్తం మీద చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంట్రీ ఇచ్చారు మహేష్. దీంతో మహేష్ బాబుకు సినిమాలపై మరింత మక్కువ పెరిగింది. దీంతో డాక్టర్ అవ్వాలనే కోరికను పక్కన పెట్టి చదువు పూర్తయ్యాక రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రాజకుమారుడు అనే సినిమాతో మొదటి సారి తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఓ మోస్టరు హిట్ అయినా ఆ తర్వాత వచ్చిన మురారి, దూకుడు, ఒక్కడు, పోకిరి, అతడు వంటి సినిమాలు మహేష్ బాబును స్టార్ హీరోగా మార్చాయి.