Pooja Hegde (2)
Pooja Hegde: పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే(Pooja Hegde). ఒకప్పుడు ఈమె టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పిలవబడేది. ఆరంభం లో వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి కానీ, ఆ తర్వాత అరవింద సమేత, అలా వైకుంఠపురంలో, మహర్షి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన బ్రాండ్ వేల్యూ ని బాగా పెంచుకుంది. అయితే పూజ హెగ్డే కి రాధే శ్యామ్ చిత్రం నుండి అసలు ఏది కలిసి రావడంలేదు. అప్పటి నుండి, ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలన్నీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ వచ్చాయి. తమిళం లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో నెంబర్ 1 స్థానం లో కూర్చున్న విజయ్ లాంటి హీరోకు కూడా ‘బీస్ట్’ లాంటి ఫ్లాప్ ని అందించింది ఈమె. అదే విధంగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఈ హాట్ బ్యూటీ పెద్ద పొరపాటే చేసింది.
Also Read: ఎన్టీఆర్ మాటలు లెక్క చేయకుండా కెరీర్ ని నాశనం చేసుకున్న సంపూర్ణేష్ బాబు!
అక్కడ దాదాపుగా ఈమె అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది కానీ, వాళ్ళతో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. సల్మాన్ ఖాన్(Salman Khan), హృతిక్ రోషన్(Hrithik Roshan), రణవీర్ సింగ్(Ranveer Singh), అక్షయ్ కుమార్(Akshay Kumar), షాహిద్ కపూర్(Shahid Kapoor) ఇలాంటి టాప్ బాలీవుడ్ స్టార్స్ అందరితో సినిమాలు చేసింది. అందరికీ కెరీర్ బెస్ట్ ఫ్లాప్స్ ని అందించింది. ఇప్పుడు వరుణ్ ధావన్ తో ఇంకో సినిమా చేస్తుంది. అదే విధంగా తమిళం లో వరుసగా అవకాశాలను సంపాదిస్తుంది. సూర్య రెట్రో చిత్రం లో నటించిన పూజ, విజయ్ తో ఒక సినిమా, అదే విధంగా రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న ‘కాంచన 4’ అనే మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా రెట్రో చిత్రం మే 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా తెలుగు, తమిళం భాషల్లో విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని ఇప్పటి నుండే ప్రారంభించారు మేకర్స్. ముందుగా పూజ హెగ్డే ప్రొమోషన్స్ చేసే ముందు నేడు శ్రీకాళహస్తి కి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేయించింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజెన్స్ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. పూజ హెగ్డే తిరుమల దేవస్థానం కి వచ్చి ఆరేళ్ళు అయ్యింది. ఈ ఆరేళ్లలో ఆమెకు దేవుడు గుర్తుకు రాలేదు. శ్రీకాళహస్తి కి అయితే ఈరోజు కాకుండా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రాలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె శ్రీకాళహస్తి కి రావడం పై సోషల్ మీడియా లో వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. పూజ హెగ్డే కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్లనే దేవుడు గుర్తొచ్చాడని, అంతకు ముందు ఆమెకు దేవుడు గుర్తుకు రాలేదని అంటున్నారు.