Rajamouli and His Wife Rama: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి..ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమాలను చేస్తూ తెలుగు సినిమా స్థాయిని ఇండియా వైడ్ గా పరిచయం చేసి చాలా గొప్పగా పేరు సంపాదించుకున్నాడు. ఇక అందులో భాగంగానే బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి కూడా చాటి చెప్పి ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ లోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రాజమౌళి ఎప్పుడు తెర వెనక ఉండి కష్టపడటం. యాక్షన్, కట్ చెప్పడం మాత్రమే మనం చూశాం. కానీ రాజమౌళి లో తెలియని ఇంకొక కోణం కూడా ఉంది. అదేంటంటే డాన్స్ చేయడం. అవును మీరు విన్నది నిజమే..
రాజమౌళి చాలా మంచి డ్యాన్సర్. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదు కదు అయిన నమ్మాలి. ఇక రీసెంట్ గా రాజమౌళి తన భార్య అయిన రమా వీళ్ళిద్దరూ కలిసి ఒక పెళ్లి ఈవెంట్ లో డ్యాన్స్ చేశారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దానికి సంబంధించిన రిహార్సల్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు అది వైరల్ అవుతుంది… ఇక అసలు విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహం ఇటీవల ఘనంగా జరిగింది.
అయితే ఈ ఈవెంట్ కి హాజరైన రాజమౌళి దంపతులు డ్యాన్స్ చేసి అక్కడున్న వాళ్లను ఉత్సాహపరిచారు. అయితే ఇప్పుడు ఆ వీడియో కి సంబంధించిన రిహార్సల్ వీడియో ఒకటి నెట్టింట్ట హల్చల్ చేస్తుంది. రాజమౌళి రమా ఒకప్పటి ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవా చేసిన “అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే” సాంగ్ మీద డాన్స్ చేయడం విశేషం. ఇక అందులో భాగంగానే రాజమౌళి ఆ పాటకు వేస్తున్న స్టెప్పులు కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాయి.
అలాగే చాలా స్టైలిష్ గా కూడా ఉన్నాయి. నిజానికి రాజమౌళి దర్శకుడుగానే కాదు, డాన్సర్ గా కూడా పని చేస్తాడు అంటూ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్క అభిమాని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే రాజమౌళి అంటే ‘సకల కళ వల్లభుడు ‘ అనేది మాత్రం వాస్తవమని ఇంకొంతమంది ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు…