Rajamouli: సినిమా ఇండస్ట్రీ కి రావాలి అనే కోరిక పుటడం అనేది ఒక పిచ్చి అనే చెప్పాలి. ఇక ఇప్పుడున్న జనరేషన్ లో ఇండస్ట్రీకి వెళ్లాలనే ఒక తపన ప్రతి పది మందిలో ఆరుగురికి ఉంటుందట. అయినప్పటికీ అందులో కొందరు మాత్రమే సాహసం చేసి సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. అందులో కొంతమంది కష్టాలను ఎదుర్కొని కన్నీళ్లను దిగమింగుతూ అవకాశం కోసం వేచి చూస్తూ ఛాన్స్ లు వచ్చినపుడు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్లకు ఇక్కడ సక్సెస్ అనేది దక్కుతుంది.
అయితే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం పాన్ ఇండియా లో తను సినిమాలను చేస్తున్నాడు అంటే దాని వెనకల చాలా కష్టం ఉంది. ఎన్నో సంవత్సరాల కృషి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన క్షణాలు ఉన్నాయి. కాబట్టే తను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాడనే చెప్పాలి.
మరి ఇలాంటి క్రమంలో రాజమౌళి తో పాటు కెరియర్ స్టార్టింగ్ లో తన ఫ్యామిలీ ని కూడా వదులుకొని తనతో పాటు ట్రావెల్ చేసిన ఒక నటుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ఛత్రపతి శేఖర్…
ఈయన కెరియర్ స్టార్టింగ్ లో రాజమౌళి తో పాటు ట్రావెల్ చేస్తూ ఇంటికి కూడా వెళ్లకుండా రాజమౌళితో పాటే ఉంటూ ఆఫీస్ లోనే దాదాపు రోజుకు 18 గంటల పాటు కష్టపడి పని చేస్తూ రాజమౌళికి హెల్ప్ చేసేవారట… అందుకే రాజమౌళి చేసిన ప్రతి సినిమాలో తనకి ఒక మంచి క్యారెక్టర్ ని ఇస్తూ తనని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఎన్ని క్యారెక్టర్లు చేసినా కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం తను ఎదగలేకపోతున్నాడు. ఛత్రపతి సినిమాతో కాట్ రాజ్ కి ఎలాంటి గుర్తింపు అయితే వచ్చిందో ఈయనకి మాత్రం అలాంటి ఒక సాలిడ్ గుర్తింపు అయితే రావడం లేదు.
మరి రాజమౌళి తనకి అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆ పాత్రలో తను అద్భుతంగా నటిస్తూ వస్తున్నాడు. అయిన కూడా ఈయన ఎక్కువగా రాజమౌళి సినిమాలో మాత్రమే కనిపిస్తున్నాడు. మిగతా డైరెక్టర్లు ఎందుకు ఈయన మీద ఎక్కువ ఫోకస్ చేయడం లేదు అనేది ఎవరికి అర్థం కావడం లేదు…