https://oktelugu.com/

Vikram: కొత్త దర్శకులకు విక్రమ్ ఉన్నాడనే భరోసా ఉందా..? ఆయన వల్లే తంగలాన్ లాంటి సినిమాలు వస్తున్నాయా..?

సినిమా హీరోలకు సక్సెస్ లు చాలా ముఖ్యం...ఎందుకంటే దాని వల్లనే వాళ్ళు ఫ్యాన్స్ ను ఏర్పాటు చేసుకుంటారు. దానివల్లే మార్కెట్ పెరుగుతుంది...కాబట్టి ఇక్కడ సక్సెస్ ఒక్కటే టార్గెట్....

Written By:
  • Gopi
  • , Updated On : August 18, 2024 / 08:44 AM IST

    Vikram

    Follow us on

    Vikram: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్, కమల్ హాసన్ ల తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో విక్రమ్ ఒకరు. ముఖ్యంగా ఆయన వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. కాబట్టే ఆయన్ని మిగతా హీరోల నుంచి చాలా సపరేట్ గా చేసి చూడగలుగుతున్నాం…ఇక దానివల్లే ఆయన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క అభిమానికి కూడా చాలా బాగా గుర్తుండిపోతాడు. ఆయన సినిమాలు ఎక్కువగా తమిళ్ తోపాటు తెలుగు, మలయాళం లో డబ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా ఆయనకు మంచి ఆదరణ అయితే దక్కుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన ‘తంగలాన్ ‘ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమా మీద మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా ఆ అంచనాలను రీచ్ అవుతూ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి.

    ఇక ఆ రోజు రిలీజైన ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు ప్లాప్ టాక్ ను తెచ్చుకోవడంతో ‘తంగలాన్’ సినిమాకి అది మరింత హెల్ప్ అయిందనే చెప్పాలి. ఇక తంగలాన్ సినిమా చూడడానికే అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆగస్టు 15వ తేదీన నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో ఆయ్, తంగలాన్ రెండు సినిమాలకు మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ఇక మిగిలిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైందంటూ సినీ విమర్శకులు తెలియజేస్తున్నారు.

    ఇక 2005 వ సంవత్సరంలో వచ్చిన ‘అపరిచితుడు’ సినిమా తర్వాత విక్రమ్ కి సరైన సక్సెస్ అయితే రాలేదు. ఇక ఈ సినిమాతో ఆయనకు ఒక మంచి సక్సెస్ రావడమే కాకుండా మరోసారి ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి. ఇక ఇప్పటికి కూడా విక్రమ్ లాంటి నటుడు చేసే పాత్రని మిగతా హీరోలు ఎవ్వరూ చేయరు. అందరూ సేఫ్ జోన్ లో కమర్షియల్ సినిమాలని చేస్తుంటారు. లేదంటే రెగ్యూలర్ ఫార్మాట్ లో ఎమోషనల్ డ్రామా లాంటి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.

    కానీ ఒక అడవి జాతికి చెందిన తెగలకు సంబంధించిన విచిత్రమైన గెటప్ లతో సినిమాలు చేయడం అనేది మిగతా హీరోల వల్ల కాదు. అది కేవలం ఒక విక్రమ్ వల్ల మాత్రమే అవుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న దర్శకులు వైవిధ్యమైన పాత్రలను రాసుకుంటున్నారు అంటే అది కేవలం విక్రమ్ ఉన్నాడనే ధైర్యంతోనే రాసుకుంటున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…ఇక మీదట కూడా విక్రమ్ వరుసగా ప్రయోగాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తే మరోసారి ఆయన స్టార్ హీరోగా ఎదుగుతాడు…