
దర్శక దిగ్గజం రాజమౌళి ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచివే. రాజమౌళి తెరకెక్కించిన చివరి చిత్రం ‘బాహుబలి-2’ టాలీవుడ్, ఇండియన్ రికార్డులతోపాటు ప్రపంచ రికార్డులను సృష్టించింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా ‘బాహుబలి’ నిలిచిన సంగతి తెల్సిందే..!
Also Read: పాకిస్తాన్ – ఇండియా యుద్ధం నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా !
‘బాహుబలి’ సీరిసుల తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీలో నటిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. సినిమా ఫీల్డులో పనిచేసే ఒకరిద్దరు మినహా చాలామందికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుందన్న విషయం తెల్సిందే. సినిమా ప్రారంభం.. ఫస్టులుక్.. టీజర్.. ట్రైలర్.. నటీనటులు.. సాంకేతిక నిపుణుల ఎంపిక.. కాంబినేషన్ ఇలా అన్నింట్లో సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు.
ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి ‘9’ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు కన్పిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం అనౌన్స్ చేసిన కొన్ని డేట్స్ ను విశ్లేషిస్తే ఇదే ఇట్టే అర్థమవుతుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ అక్టోబర్ 22న ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో రాబోతోందని ప్రకటించింది. ఈ డేట్ ని కలిపితే (22+10+2020=9) వస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో కనిపిస్తున్న కారు.. బైక్ నంబర్ ప్లేట్స్ కూడా ‘9’ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. కార్ నంబర్ 6+1+7=9కాగా బైక్ నంబర్ 1+9+7+1=9 వస్తోంది.
Also Read: ‘కాజల్ వెడ్స్ గౌతమ్’.. షాక్ లో అభిమానులు..!
ఆర్ఆర్ఆర్ టీం గతంలో విడుదల చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ రిలీజ్ డేట్ ను కూడినా తొమ్మిది వస్తోంది(27+5+2020=9). అదేవిధంగా ‘ఆర్ఆర్ఆర్’ పేరు తీసుకున్నా.. ఇంగ్లీష్ లెటర్ ‘R’ అంటే 18(1+8=9). ‘ఆర్ఆర్ఆర్’ అంటే 18+18+18 మొత్తం కూడిన తొమ్మిది నెంబరే వస్తోంది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ‘9’ నంబర్ ను ఫాలో అవుతుందని అర్థమవుతోంది. న్యూమరాలజీని ఫాలో అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ టీంకు తొమ్మిది సెంటిమెంట్ ఏమేరకు కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే..!